బీఎస్‌ఎన్‌ఎల్‌: కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌

31 Mar, 2018 10:33 IST|Sakshi

ఆరు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు

రూ.118 ప్రారంభ ప్యాక్‌

అన్ని ప్లాన్లలో పెర్సనలైజ్డ్‌ రింగ్ బ్యాక్ టోన్  ప్రీ

సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌  కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను ప్రకటించింది.ఒకటి కాదు రెండు ఏకంగా ఆరు ప్లాన్లను  తీసుకొచ్చింది. సరసమైన ధరలో రూ.118 ప్రారంభ ప్యాక్‌గా,  రూ.379,  రూ. 551 సహా ఇతర ప్రీపెయిడ్‌ ప్లాన్లను ఆవిష్కరించింది. అలాగే రూ.339 ప్లాను రివ్యూ చేసి అదనపు సౌకర్యాలను జోడించింది. ముఖ్యంగా రిలయన్స్ జియోతో పాటు ఇతర టెలీకాం సంస్థల పోటీని ఎదుర్కొనే  వ్యూహంలో భాగంగా ఈ కొత్త టారిఫ్ ప్లాన్లను తీసుకొచ్చింది. దీంతోపాటు  ఈ అన్ని కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లలో వినియోగదారులు వ్యక్తిగతీకరించిన రింగ్ బ్యాక్ టోన్ (పీఆర్‌బీటీ) కు ఉచితంగా అందిస్తోంది.
 
రూ. 118 ప్లాన్‌: 
1జీబీ డేటా, అన్‌ లిమిటెడ్‌ కాల్స్‌, 28 రోజులు వాలిడిటీ.  ఈ ప్లాన​ తమిళనాడు సర్కిల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.  
రూ.379ప్లాన్‌: రోజుకు 4జీబీ 4జీ/3జీ డేటా .. బీఎస్‌ఎన్‌ఎల్‌ టూ బీఎస్‌ఎన్‌ఎల్‌ రోజుకు 30 నిమిషాల వాయిస్‌ కాల్స్‌, 30రోజులు వాలిడీటీ. అయితే ఈ ప్లాన్‌ కేరళ సర్కిల్‌లో మాత్రమే.
రూ.551ప్లాన్‌: రోజుకు 1.5జీబీ 4జీ డేటా , కేరళకు మాత్రమే ప్రత్యేకం.
రూ. 444 ప్లాన్‌:1.5జీబీ 4జీ డేటా,  అన్‌లిమిటెడ్‌కాల్స్‌,  60 రోజులు వాలిడిటీ.
రూ.666 ప్లాన్‌: 1 జీబీ 4జీడేటా,   అన్‌లిమిటెడ్‌కాల్స్‌, రోజుకు వంద  ఎస్‌ఎంఎస్‌లు,129 రోజులు వాలిడిటీ.
రూ.485 ప్లాన్‌: రోజుకు1 జీబీ 4జీడేటా,   రోజుకి వంద  ఎస్‌ఎంఎస్‌లు,  అన్‌లిమిటెడ్‌కాల్స్‌, 90 రోజులు వాలిడిటీ.

దీంతోపాటు రూ.799ల మరో ప్రీమియం ప్రీపెయిడ్‌ ప్లాన్‌లో 30జీబీ డేటా, అన్‌లిమిటెడ​ కాల్స్‌​ ఆఫర్‌  చేస్తోంది.అ లాగే ఇటీవల లాంచ్‌ చేసిన రూ.399 ప్లాన్‌ను మోడిఫై చేసి   ఇపుడు అన్‌ లిమిటెడ్‌కాల్స్‌ అందిస్తోంది. ఏప్రిల్‌ 1 నుంచి ఇవిఅమల్లోకి  రానున్నాయి.  మరోవైపు మిగతా  ప్రాంతాల్లో ఈ ప్లాన్లను ఎపుడు అమలు చేసేదీ  బీఎస్‌ఎన్‌ఎల్‌ వెల్లడిచేయలేదు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు