బౌండరీలు ఎక్స్‌పెక్ట్‌ చేస్తే..  స్టడీ సింగిల్స్‌

6 Jul, 2019 15:48 IST|Sakshi

సాక్షి,ముంబై: ఆర్థిక బడ్జెట్‌పై  ప్రముఖపారిశ్రామిక వేత్త , మహీంద్ర అండ్‌ మహీంద్ర ఛైర్మన్‌  ఆనంద్‌ మహీంద్ర స్పందించారు. బౌండరీలు కొడతారని ఆశిస్తే .ఆమె  స్టడీ సింగిల్స్ తీశారని ట్వీట్‌ చేశారు.  రన్‌రేట్‌ తగ్గకుండా చూసుకుంటూ..దీర్ఘకాలానికి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆకాంక్ష  ఆమె బడ్జెట్‌లో కనిపించిందని వ్యాఖ్యానించారు.  అందరూ ఆశించినట్టుగా ..పలు అంచనాలకు భిన్నంగా ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే  విధానం ..పెద్ద పెద్ద ఎత్తుగడలు కాకుండా.. మోదీ ప్రభుత్వం  దీర్ఘకాలిక బడ్జెట్‌పై  దృష్టి పెట్టిందన్నారు. 

ప్యాసింజిర్‌ వాహనాలపై వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) తగ్గింపును ఆశించి భంగపడిన బిజినెస్‌ టైకూన్‌ స్పందిస్తూ అన్ని కార్లపై జీఎస్టీని తగ్గించే బదులు, మొబిలీటీ, ప్రోత్సాహకాలతో మాత్రమే ఆమె సరిపెట్టారని పేర్కొన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే ప్రయాణంలో సీతారామన్ బడ్జెట్ దేశానికి సహాయపడుతుందని ఆనంద్ మహీంద్రా  ప్రశంసించారు. ముఖ్యంగా మందగమనంలో ఉన్న ఆర్థికవ్యవస్థ పుంజుకునే దశలో సీతారామన్‌ ఎత్తుగడలు, అడుగులతో  ఆర్థికరంగం పుంజుకోనుందని,  ఆర్థిక వ్యవస్థ అనే ఇంజీన్‌కు ఇవి లూబ్రికెంట్‌లా పనిచేస్తాయంటూ వరుస ట్వీట్లలో ప్రశంసించడం విశేషం. 

కాగా విత్తమంత్రి  నిర్మలా సీతారామన్‌ తొలి బడ్జెట్‌పై అధికార పక్షం ప్రశంసలు కురిపిస్తుండగా, నిర్మలా సీతారామన్‌ వాక్చాతుర్యం తప్ప, పటిష్టమైన ఆర్థిక విధానాలపై దృష్టిపెట్టలేదన్న విమర్శలు  వినిపించాయి. ముఖ్యంగా 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనపై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సందేహాన్ని వ్యక్తం చేయగా, పెట్టుబడులకు సంబంధించి, ముఖ్యంగా ఎఫ్‌డీఐలపై  కీలక అంశాల ప్రస్తావన లేదని   మాజీ  ఆర్థికమంత్రి , కాంగ్రెస్‌ నేత చిదంబరం, ఇతర రాజకీయ ఆర్థిక  విమర్శకులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.  

చదవండి: అందరమూ దానికోసమే వెదుకుతున్నాం..!

మరిన్ని వార్తలు