బడ్జెట్‌ 2020 : స్థిరాస్థి రంగానికి జోష్‌..

27 Jan, 2020 11:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనంతో పాటు పలు సమస్యలతో సతమతమవుతున్న నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో పలు ఉపశమన చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. నేలచూపులు చూస్తున్న రియల్‌ఎస్టేట్‌ రంగంలో ఉత్తేజం పెంచేందుకు ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే రాబడిపై విధించే క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ను పూర్తిగా ఎత్తివేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఏదైనా స్థిరాస్థిని విక్రయించగా సమకూరే మొత్తాన్ని మూడేళ్లలోగా మరో ఆస్తి కొనేందుకు పెట్టుబడి పెట్టని పక్షంలో దానిపై 30 శాతం క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ విధిస్తున్నారు.

ఈ ట్యాక్స్‌ రద్దుతో నిర్మాణ రంగంలో కార్యకలాపాలు జోరందుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఇక షేర్లపై విధించే డివిడెండ్‌ డిస్ర్టిబ్యూషన్‌ ట్యాక్స్‌లోనూ హేతుబద్ధత చేపట్టడం, దీర్ఘకాల మూలధన రాబడి పన్ను పరిమితి ప్రస్తుతమున్న ఏడాది నుంచి రెండేళ్లకు పెంచడం వంటి చర్యలు చేపట్టవచ్చని భావిస్తున్నారు.

చదవండి : వాటి ధరలు ఇక షాకే..

మరిన్ని వార్తలు