కేంద్రానికి రాష్ట్ర ఆర్థిక మంత్రుల ‘బడ్జెట్‌’ సూచనలు

19 Jan, 2018 00:40 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారంనాడు రాష్ట్రాల ఆర్థికమంత్రులతో బడ్జెట్‌ ముందస్తు సంప్రతింపులు జరిపారు. వివిధ ఆర్థిక అంశాలు, బడ్జెట్‌ విధానాలపై ఈ సందర్భంగా వారు కేంద్రానికి పలు సూచనలు చేశారు. కేంద్ర బడ్జెట్‌కు ముందు రాష్ట్రాల ఆర్థికమంత్రులతో కేంద్ర ఆర్థికమంత్రి సమావేశం జరిపి, వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకోవడం సంప్రదాయకంగా కొనసాగుతోంది.

ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. సమావేశం సందర్భంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థికమంత్రులు ఒక మెమోరాండం సమర్పించినట్లు సమాచారం. దీనిని క్షుణ్నంగా అధ్యయనం చేసి, అవసరమైన అన్ని ప్రతిపాదలనూ సమాఖ్య సహకార స్ఫూర్తికి అనుగుణంగా 2018–19 బడ్జెట్‌ ప్రతిపాదనల్లో చేర్చడం జరుగుతుందని జైట్లీ ఈ సందర్భంగా పేర్కొన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.

హిమాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు, బిహార్, ఢిల్లీ, గుజరాత్, మణిపూర్, తమిళనాడు ఉపముఖ్యమంత్రులు, 14 రాష్ట్రాల ఆర్థికమంత్రులు, మంత్రులు తమ తమ రాష్ట్రాల ఆర్థికమంత్రిత్వ శాఖలకు నేతృత్వం వహిస్తూ సమావేశంలో పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు