ఆ రైలు రోజుకు 100 ట్రిప్పులు వెయ్యాల్సిందే

18 Apr, 2016 17:58 IST|Sakshi
ఆ రైలు రోజుకు 100 ట్రిప్పులు వెయ్యాల్సిందే

అహ్మదాబాద్: ఒక రైలు ఒక ట్రిప్పులో 300 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అంలాంటివి రోజుకు 100 ట్రిప్పులు వేస్తేగానీ ఆ రైలు కోసం చేసిన అప్పు తీరదు! 'ఆ.. ఒక రైలు 100 ట్రిప్పులు తిరగటమేంటి? సాధ్యమయ్యేపనేనా!'అనే సందేహం రావచ్చు. అది అలాంటిలాంటి రైలు కాదు.. ఇండియన్ రైల్వేస్ కలల ప్రాజెక్టు బుల్లెట్ ట్రైన్. వచ్చే ఏడాది చివర్లో పట్టాలెక్కనున్న బుల్లెట్ ట్రైన్ తొలి దశ సర్వీసు ముంబై- అహ్మదాబాద్ ల తిరగనుంది.

300 కిలోమీటర్ల ప్రయాణానికి టికెట్ ధర రూ. 1500 అనుకుంటే, రోజుకు 100 ట్రిప్పులు అంటే 88 వేల నుంచి 1.18 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తేగానీ ఈ ప్రాజెక్టు వర్క్ అవుట్ కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. రైల్వే శాఖ అభ్యర్థన మేరకు ఐఐఎం అహ్మదాబాద్ ఒక నివేదిక ను సమర్పించింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం జపాన్ నుంచి తీసుకునే రూ.97,636 కోట్ల రుణాన్ని గడువు లోపు వడ్డీతో కలిపి చెల్లించాలంటే రోజుకు 100 ట్రిప్పులు తప్పవని సూచించింది.

జపాన్ నుంచి తీసుకునే రుణంలో 80శాతం  0.1 శాతం వడ్డీతో  50 ఏళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 20 శాతం రుణాన్ని 8 శాతం వడ్డీరేట్ తో కేంద్ర తన వాటాగా అందించనుంది. బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రాజెక్టు 2017 చివరిలో ప్రారంభంకానుంది. ప్రాజెక్టు చేపట్టిన  ఐదేళ్లలో ముంబాయి-అహ్మదాబాద్ వాసులకు అందుబాటులోకి రానుంది. ప్రధాని నరేంద్రమోదీ చేపట్టబోయే ప్రాజెక్టులో ఈ ప్రాజెక్టు అత్యంత ప్రతిష్టాత్మకమైనది.

మరిన్ని వార్తలు