వ్యాపార వర్గాల్లో పెరిగిన విశ్వాసం

10 Apr, 2017 02:52 IST|Sakshi
వ్యాపార వర్గాల్లో పెరిగిన విశ్వాసం

జీవితకాల గరిష్ట స్థాయికి సీఐఐ వ్యాపార విశ్వాస సూచీ
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల వ్యాపార వర్గాలు ఎంతో ఆశాభావంతో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక రంగ కార్యకలాపాలు పుంజుకుంటాయన్న విశ్వాసం వారిలో వ్యక్తమవుతోంది. దీన్ని ప్రతిఫలిస్తూ సీఐఐ వ్యాపార విశ్వాస సూచీ (బీసీఐ) జనవరి–మార్చి త్రైమాసికంలో జీవితకాల గరిష్ఠ స్థాయిలకు చేరింది. ‘‘2017 ఆగమనంతోనే వ్యాపార దృక్పథంలో స్వల్ప వృద్ధి నెలకొంది. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల చర్యలు కంపెనీలకు పెట్టుబడుల అవకాశాలు కల్పిస్తాయనే ఆశాభావం నెలకొంది’’ అని సీఐఐ పేర్కొంది.

 వ్యాపార సెంటిమెంట్‌ బలంగా ఉందని, తమ రంగాల్లో భవిష్యత్తు కార్యకలాపాల పట్ల కంపెనీలు ఆవాభావంతో ఉన్నాయని తెలిపింది. సీఐఐ దేశ వ్యాప్తంగా వ్యాపారుల అభిప్రాయాలను సేకరించి ఈ ఫలితాలను వెల్లడిస్తుంటుంది. తాజాగా 98వ ఎడిషన్‌ ఫలితాలను వెల్లడించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో బీసీఐ 64.1గా నమోదు కాగా, ఇది అంతకు ముందు త్రైమాసికం (2016 అక్టోబర్‌–నవంబర్‌)లో 56.5గా ఉంది. 200 భారీ, మధ్య స్థాయి, చిన్న, సూక్ష్మ సంస్థల నుంచి  అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా సేకరించారు.

సర్వే ఫలితాలు
 జనవరి – మార్చి త్రైమాసికంలో 63 శాతం సంస్థలు విక్రయాలు పెరిగినట్టు చెప్పాయి. అంతకు ముందు మూడు నెలల కాలంలో ఇలా విక్రయాలు పెరుగుదల చూసిన సంస్థలు 39 శాతమే.

 కొత్త ఆర్డర్లు కూడా పెరగొచ్చన్న విశ్వాసం 60 శాతం సంస్థల నుంచి వ్యక్తమైంది. అంతకుముందు కాలంలో ఇది 41 శాతమే.

>
మరిన్ని వార్తలు