విమానంలో వ్యాపారవేత్తకు చేదు అనుభవం

22 Nov, 2017 17:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఓ వ్యాపారవేత్తకు విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. భారత కరెన్సీ చెల్లక పోవడం వివాదాస్పదంగా మారింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఇండియన్ బిజినెస్ మ్యాన్ ప్రమోద్ కుమార్ జైన్ ఇటీవల బెంగళూరు నుంచి దుబాయికి ఇండిగో విమానంలో ప్రయాణించారు. అయితే తాను ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ఏదో వస్తువు కొనుగోలు చేయడం లేదా అవసరాల నిమిత్తం మన కరెన్సీని చెల్లించాలని చూడగా కరెన్సీ చెల్లదంటూ సిబ్బంది వాటిని తిరస్కరించారు.

దేశానికి చెందిన కరెన్సీ చెల్లదని భారత్ నుంచి వెళ్తున్న విమానంలో చెప్పడంతో వ్యాపారవేత్త ప్రమోద్ కుమార్ కంగుతిన్నారు. దేశం నుంచి నడుస్తున్న విమానంలో భారత కరెన్సీ చెల్లదని చెప్పడం దేశద్రోహ చర్యగా పరిగణిస్తారు. దీనిపై తాను ఢిల్లీ పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. భారతీయుల గౌరవ చట్టం 1971 ప్రకారం స్వదేశంలోనే కరెన్సీ చెల్లదని, స్వీకరించకపోవడం ఉల్లంఘన కిందకి వస్తుందన్నారు. తాను ఫిర్యాదు చేసిన కేసుపై డిసెంబర్ 15న విచారణ జరగనున్నట్లు ప్రమోద్ కుమార్ జైన్ వివరించారు. స్వదేశం నుంచి తిరుగుతున్న విమానాల్లోనే మన కరెన్సీ చెల్లదంటూ, ఆ డబ్బును వెనక్కి ఇవ్వడం చాలా దారుణమని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు