2022 నాటికి 7 లక్షల ఐటీ ఉద్యోగాలు ఔట్‌!!

7 Sep, 2017 06:58 IST|Sakshi
2022 నాటికి 7 లక్షల ఐటీ ఉద్యోగాలు ఔట్‌!!

 ఆటోమేషన్‌ ప్రభావం ఇది...
అమెరికా సంస్థ హెచ్‌ఎఫ్‌ఎస్‌ రీసెర్చ్‌


బెంగళూరు: దేశీ ఐటీ రంగంలో ఆటోమేషన్‌ వల్ల 2022 నాటికి దాదాపు 7 లక్షల లో–స్కిల్డ్‌ ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదముంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన రీసెర్చ్‌ సంస్థ ‘హెచ్‌ఎఫ్‌ఎస్‌ రీసెర్చ్‌’ ఒక నివేదికలో పేర్కొంది. మీడియం–స్కిల్డ్, హై–స్కిల్డ్‌ ఉద్యోగాలు మాత్రం వరుసగా లక్ష వరకు, 1.9 లక్షల వరకూ పెరగవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. అంతర్జాతీయంగా చూస్తే ఐటీ పరిశ్రమలో ఉద్యోగాలు నికరంగా 7.5 శాతం తగ్గొచ్చని పేర్కొంది.

అమెరికా, యూకే, ఇండియా వంటి దేశాల్లో ఉద్యోగుల తొలగింపు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉద్యోగాల కోతకు రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి  అంశాలను ప్రధాన కారణంగా చూపింది. ఇక ఫిలిప్పీన్స్‌లో ఐటీ ఉద్యోగాలు స్వల్పంగా పెరిగే అవకాశముందని తెలిపింది. కాగా ప్రస్తుత నేపథ్యంలో మొత్తం సిబ్బందిలో 20 శాతం మందికి కొత్త నైపుణ్యాలు అవసరమని, అప్పుడే వారు ఉద్యోగాల్లో కొనసాగగలరని అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు