ట్రాయ్‌ షాక్‌; ఆ షేర్లు ఢమాల్‌

2 Jan, 2020 13:02 IST|Sakshi

సాక్షి,ముంబై:  కేబుల్‌  వినియోగదారులకు ఊరటనిచ్చేలా ట్రాయ్‌ తీసుకొచ్చిన టారిఫ్‌ నిబంధనల సవరణలు  కేబుల్ టీవీ ఆపరేటర్లకు షాక్‌ ఇచ్చాయి. స్టాక్‌మార్కెట్లో  టీవీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. కేబుల్ , ప్రసార సేవల కోసం కొత్త రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లో ట్రాయ్ సవరణలు చేసిన తరువాత గురువారం ఆపరేటర్ల షేర్లు 6 శాతానికి పైగా క్షీణించాయి. సన్ టీవీ నెట్‌వర్క్ 6.37 శాతం, డెన్ నెట్‌వర్క్స్ 3.90 శాతం, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ 2.99 శాతం, డిష్ టీవీ ఇండియా 0.85 శాతం కుప్పకూలాయి. మరోవైపు సెన్సెక్స్‌ 232 పాయింట్లకు పైగా ఎగియగా, నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో  పాజిటివ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి.  వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే ప్రయత్నంలో  2017 టారిఫ్ నిబంధనలను సవరించిన  మరీ తీసుకొచ్చిన  ట్రాయ్‌ కొత్త నిబంధనలు మార్చి 1 నుంచి  అమలులోకి  రానున్న సంగతి తెలిసిందే. 

చదవండి :  ఎంఎస్‌వోలకు షాక్‌, వినియోగదారులకు ఊరట

>
మరిన్ని వార్తలు