4జీ నెట్‌వర్క్‌లకు ట్రాయ్‌ కొత్త ప్రమాణాలు

1 Aug, 2018 00:49 IST|Sakshi

న్యూఢిల్లీ: టెలికం వినియోగదారులు 4జీ టెక్నాలజీపై కాల్స్‌ విషయంలో సమస్యలను ఎదుర్కొంటుండడంతో ట్రాయ్‌ కళ్లు తెరిచింది. 4జీ కాల్స్‌లో వాయిస్‌ వినపడకుండా ఆగిపోతుండడంతో నాణ్యతను గుర్తించేందుకు నూతన ప్రమాణాలను నిర్దేశిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. 2జీ, 3జీ టెక్నాలజీలకు భిన్నంగా 4జీ నెట్‌వర్క్‌లో కాల్స్‌ అన్నవి డేటా ఆధారంగానే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ (ఐపీ) టెక్నాలజీ ఆధారంగా దీన్ని రూపొందించారు. 2జీ, 3జీ నెట్‌వర్క్‌లో కాల్స్‌ అన్నవి ఆటోమేటిక్‌గా కట్‌ అయిపోవడం కస్టమర్లకు అనుభవమే. నిబంధనల ప్రకారం వీటిని కాల్‌డ్రాప్‌గా పరిగణిస్తారు. కానీ, 4జీ నెట్‌వర్క్‌లో డేటా సిగ్నల్స్‌ లేకపోతే కాల్‌ మధ్యలో వాయిస్‌ వినిపించకుండా పోతుంది కానీ కాల్‌ కట్‌ అవ్వదు.

అవతలి వారి మాటలు వినిపించకపోవడంతో కస్టమర్లే స్వయంగా కాల్‌ను ముగించేస్తుంటారు. దీంతో 2జీ, 3జీ నెట్‌వర్క్‌ నిబంధనల మేరకు ఇలా మాటలు వినిపించకుండా పోవడాన్ని కాల్‌ డ్రాప్‌గా పరిగణించడానికి లేదు. దీంతో డేటా ప్యాకెట్‌ ఆధారంగానే కాల్స్‌ నాణ్యతను పరిగణించే నిబంధనలను ట్రాయ్‌ తీసుకొచ్చింది. అక్టోబర్‌ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ‘‘భాగస్వాముల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రెండు నూతన నెట్‌వర్క్‌ ప్రమాణాలు.. డౌన్‌లింక్‌ ప్యాకెట్‌ డ్రాప్‌ రేట్‌ (డీఎల్‌–పీడీఆర్‌), అప్‌లింక్‌ ప్యాకెట్‌ డ్రాప్‌ రేట్‌ (యూఎల్‌–పీడీఆర్‌) ను ప్రవేశపెడుతున్నాం. దీని ద్వారా మొత్తం మీద డేటా ప్యాకెట్‌ డ్రాప్‌ను కొలవ 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ బ్యాంక్‌ల గవర్నెన్స్‌ మెరుగుపడుతుంది..

ఇక మూడు రోజుల్లోనే లిస్టింగ్‌

హైదరాబాద్‌లో ఫెనటిక్స్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌

మొండిబాకీల విక్రయంలో ఎస్‌బీఐ

బన్సల్‌ కేసులో ఇన్ఫీకి ఎదురుదెబ్బ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కథ ముఖ్యం అంతే! 

డాడీ కోసం డేట్స్‌ లేవ్‌!

దాచాల్సిన అవసరం లేదు!

గురువారం గుమ్మడికాయ

శ్రీకాంత్‌ అడ్డాలతో నాని?

కెప్టెన్‌ ఖుదాబక్ష్‌