కెనరా బ్యాంక్‌ నష్టం 6 రెట్లు జంప్‌

25 Jun, 2020 03:58 IST|Sakshi

క్యూ4లో రూ. 3,259 కోట్లు

రూ.14,222 కోట్లకు మొత్తం ఆదాయం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం (2019–20) మార్చి క్వార్టర్‌లో రూ.3,259 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.552 కోట్ల నికర నష్టాలు వచ్చాయని, 6 రెట్లు పెరిగాయని కెనరా బ్యాంక్‌ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.14,000 కోట్ల నుంచి రూ.14,222 కోట్లకు పెరిగిందని పేర్కొంది.

► గత క్యూ4లో రూ.5,375 కోట్ల మేర కేటాయింపులు జరిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో కేటాయింపులు రూ.5,524 కోట్లు.  
► 2018–19లో రూ.347 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,236 కోట్ల నికర నష్టాలు వచ్చాయి.  
► గత ఏడాది మార్చి నాటికి 8.83 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 8.21 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 5.37 శాతం నుంచి 4.22 శాతానికి తగ్గాయి.  
► విలువ పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.39,224 కోట్ల నుంచి రూ.37,041 కోట్లకు, నికర మొండి బకాయిలు 22,955 కోట్ల నుంచి రూ.18,251 కోట్లకు తగ్గాయి.  
► ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 68.13 శాతం నుంచి 70.97 శాతానికి పెరిగింది.  
► ఈ ఏడాది ఏప్రిల్‌ 1న కెనరా బ్యాంక్‌లో  సిండికేట్‌ బ్యాంక్‌ విలీనమైంది.  

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కెనరా బ్యాంక్‌ షేర్‌ 4% నష్టంతో రూ.109 వద్ద ముగిసింది.    

మరిన్ని వార్తలు