నోట్ల రద్దుతో రియల్టీపై తీవ్ర ఒత్తిడి

10 Nov, 2016 01:26 IST|Sakshi
నోట్ల రద్దుతో రియల్టీపై తీవ్ర ఒత్తిడి

‘కేంద్రం చర్య దీర్ఘకాలంలో రియల్టీ పరిశ్రమ వృద్ధికి బాగా దోహదపడుతుంది. పారదర్శకత పెరుగుతుంది కనక నిధుల సమీకరణలో డెవలపర్ల సమస్యలు కొంతమేర తగ్గుతారుు. రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్‌లో ధరలు అనువైన స్థారుుకి తగ్గొచ్చు. రెసిడెన్షియల్, ల్యాండ్ మార్కెట్లలో లావాదేవీలు తగ్గుతూ రావడం వల్ల సమీప భవిష్యత్తులో పరిశ్రమపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుంది.
- శిశిర్ బైజాల్, నైట్ ఫ్రాంక్ ఇండియా చీఫ్

సాహసోపేత నిర్ణయం..

నల్ల ధనం కట్టడికి ప్రధాని మోది తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేతం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఇలాంటి నిర్ణయం ఎన్నడూ తీసుకోలేదు.  ప్రభుత్వం అనుకున్నట్టుగా ప్రధాని నిర్ణయ ప్రభావం స్వల్పకాలంలోనే స్పష్టంగా కనపడుతుంది. చిన్న, మధ్యతరహా వ్యాపారుల లావాదేవీలన్నీ నగదు ద్వారానే జరుగుతారుు. ప్రధాని చెప్పినట్టుగా న్యాయంగా వ్యాపారం చేసుకునే వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలి. - రవీంద్ర మోది, ఫ్యాప్సీ ప్రెసిడెంట్

 నల్లధనానికి చెక్...
కేంద్రం చాలా సాహసోపేత నిర్ణయం తీసుకుంది. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఉంటుంది. నల్లధనం, టెరర్ ్రఫైనాన్‌‌సకు ఇది ఎదురుదెబ్బ. కేంద్ర నిర్ణయాన్ని ఫిక్కీ స్వాగతిస్తోంది. తాజా నిర్ణయంతో ప్రజలు కొంత అసౌకర్యానికి గురికావొచ్చు. సమస్యల త్వరితగతి నియంత్రణకు ఆర్‌బీఐ, కేంద్రం సంయుక్తంగా పనిచేస్తున్నారుు.  - హర్షవర్ధన్ నోతియా, ప్రెసిడెంట్- ఫిక్కీ

 దీర్ఘకాలానికి మంచి ఫలితాలు..
ప్రభుత్వ చర్య హర్షణీయం. దీని వల్ల ప్రస్తుతం కొన్ని సమస్యలు ఉత్పన్నమైనా.. దీర్ఘకాలంలో మంచి ఫలితాలను పొందొచ్చు. అంతర్జాతీయంగా పారదర్శకత, అవినీతి విభాగాల్లో భారత్ ర్యాంక్ మెరుగుపడుతుంది.
- మమతా బినాని, ఐసీఎస్‌ఐ ప్రెసిడెంట్

 అవినీతి కట్టడికిది సరైన నిర్ణయం
ఇప్పుడున్న నల్ల ధనం బయటపడడానికి రూ.500, రూ.1,000 నోట్ల రద్దును మోదీ అస్త్రంగా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ధరల స్థిరీకరణ జరగడం ఖాయం. రానున్న రోజుల్లో గృహ కొనుగోళ్లలో నగదు లావాదేవీలకు ఆస్కారం ఉండకపోవచ్చు. వ్యక్తుల చేతుల్లోని నగదు పూర్తిగా బ్యాంకు వ్యవస్థలోకి వచ్చి అధికారికమవుతుంది. ఆర్థిక వృద్ధికి బాటలు పరుస్తుంది.
- కలిశెట్టి నాయుడు, రిటైల్ రంగ నిపుణులు

 ఇన్వెస్టర్ల నమ్మకం పెరుగుతుంది.. 
కేంద్ర నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుస్తుంది. బ్లాక్ మనీ, అసాంఘిక కార్యకలాపాలకు నిధుల మళ్లింపు ఇక కట్టడి అవుతుంది. నోట్ల రద్దు వల్ల సామాన్యులకు కొంత ఇబ్బందున్నా.. ఇది స్వల్పకాలమే. ప్రభుత్వం, బ్యాంకులు తగు చర్యలు తీసుకుని ఆర్థిక లావాదేవీలు నిరాటంకంగా సాగేలా చూస్తాయనే నమ్మకం ఉంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రపంచ వ్యాపార పటంలో భారత్ ర్యాంకు మెరుగై ఇన్వెస్టర్ల నమ్మకం అధికమవుతుంది.  పెట్టుబడుల రాక పెరుగుతుంది.
- రమేష్ దాట్ల, సీఐఐ దక్షిణప్రాంత చైర్మన్

మరిన్ని వార్తలు