‘లాక్‌డౌన్‌లోను భారీ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు’

20 Jul, 2020 17:50 IST|Sakshi

ముంబై: కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను నియంత్రించేందుకు అన్ని దేశాలు లాక్‌డౌన్‌లు ప్రకటించాయి. కానీ కార్ల తయారీ కంపెనీలు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లతో ఉద్యోగులను ఆశ్చర్యపరుస్తున్నాయి.  టయోటా కిర్లోస్కర్‌, హుండాయ్‌ మోటార్‌ ఇండియా, మారుతీ సుజుకీ తదితర కంపెనీలు ఉద్యోగులకు భారీ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ప్రకటించాయి. లాక్‌డౌన్‌లోను హోండా, టయోటా తదితర కంపెనీలు 4నుంచి 14శాతం ఉద్యోగులకు వేతనాలు పెంపెను ప్రకటించాయి. వేతనాల పెంపుపై హుండాయి మోటార్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ స్టీఫన్‌ సుధాకర్‌ స్పందిస్తు.. తమ కంపెనీలో బ్లు కాలర్‌ ఉద్యోగులకు నైపుణ్యం ఆధారంగా ప్రమోషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. 

అయితే త్వరలోనే జూనియర్‌, మిడిల్‌(మధ్యస్థాయి), సీనియర్‌ లెవల్‌ ఉద్యోగులకు వేతనాల విషయంలో ప్రణాళిక రచిస్తున్నట్లు స్టీఫన్‌ సుధాకర్ తెలిపారు. కాగా ఎమ్‌జీ మోటార్‌ ఇండియా కంపెనీకి చెందిన రాజీవ్‌ చాబా స్పందిస్తు.. కంపెనీ వృద్ధి సాధారణ స్థాయికి వస్తే రాబోయే రెండు, మూడు నెలల్లో ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు మహీంద్ర చీప్‌ హెచ్‌ ఆర్‌ రాజేశ్వర్‌ తిరుపతి స్పందిస్తూ.. ప్రస్తుతం వేతన తగ్గంపు ఉండదని, సాధారణంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లే ఈ సంవత్సరం కూడా ఉద్యోగులకు ప్రయోషన్లు, ఇంక్రిమెంట్లు కల్పించనున్నట్లు తెలిపారు.

అయితే దేశంలో లాక్‌డౌన్‌ సడలించి రెండు నెలలు అయినందున ప్రముఖ కార్ల కంపెనీలు 85శాతం అమ్మకాలతో జోరుమీదున్నాయి. లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు తమ గ్రామాలకు వెళ్లడం వల్ల సిబ్బంది కొరత వేదిస్తున్నట్లు కార్ల కంపెనీ అధికారులు పేర్కొంటున్నారు

మరిన్ని వార్తలు