యాక్సిస్‌ బ్యాంక్‌లో కార్లయిల్‌ పెట్టుబడి!

27 May, 2020 15:41 IST|Sakshi

రూ. 7500 కోట్లు(100 కోట్ల డాలర్లు)

ప్రాథమిక దశలో చర్చలు?

షేరు 13 శాతం జూమ్‌

దేశీ ప్రయివేట్‌ రంగ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌లో గ్లోబల్‌ పీఈ సంస్థ కార్లయిల్‌ గ్రూప్‌ ఇన్వెస్ట్‌ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రిఫరెర్షియల్‌ కేటాయింపుల ద్వారా 100 కోట్ల డాలర్ల(సుమారు రూ. 7500 కోట్లు) విలువైన యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లను కొనుగోలు చేసే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. తద్వారా యాక్సిస్‌ బ్యాంకులో కార్లయిల్‌కు 5-8 శాతం వాటా లభించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇందుకు చర్చలు జరుగుతున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతక్రితం 2017 నవంబర్‌లో బెయిన్‌ కేపిటల్‌ సైతం యాక్సిస్‌ బ్యాంకులో 1.8 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇతర ప్రయివేట్‌ రంగ బ్యాంకులు ఇండస్‌ఇండ్‌, ఆర్‌బీఎల్‌, ఐడీఎఫ్‌సీ ఫస్డ్‌ సైతం కొద్ది నెలలుగా పెట్టుబడి సమీకరణ యోచనలో ఉన్న విషయం విదితమే. దీనిలో భాగంగా కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ మంగళవారం(26న) అర్హతగల సంస్థాగత వాటాదారులకు షేర్ల జారీ(క్విప్‌) ద్వారా రూ. 7460 కోట్లకుపైగా సమీకరించేందుకు సన్నద్ధమైంది. కాగా.. కార్లయిల్‌ గ్రూప్‌ పెట్టుబడి వార్తల నేపథ్యంలో యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 13 శాతంపైగా దూసుకెళ్లి రూ. 387కు చేరింది. తొలుత ఒక దశలో రూ. 392 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

మరిన్ని వార్తలు