హైదరాబాద్‌, హాంకాంగ్‌ మధ్య ఐదో కెథే పసిఫిక్‌ ఫ్లైట్‌

26 Feb, 2019 23:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హాంకాంగ్‌ ఆధారిత ఎయిర్‌ లైన్‌ కెథే పసిఫిక్‌, తన ఇండియా నెట్‌ వర్క్‌ని పెంచాలనే లక్ష్యంతో హైదరాబాద్‌ నుంచి హాంకాంగ్‌ కి ఐదవ నాన్‌ స్టాప్‌ ఫ్లైట్‌ సేవల్ని ప్రకటించింది. ఈ సేవలు ఈ ఏడాది జూన్‌ 7 నుంచి ప్రారంభించనున్నట్లు పేర్కొంది. కేథే పసిఫిక్‌ సంస్థ హైదరాబాద్‌లో 2012 నుంచి వారానికి నాలుగు ఫ్లైట్లతో సేవలను అందిస్తోంది.ఈ సేవలు ఏయిర్‌ బస్‌ ఏ330-300 ఎయిర్‌ క్రాఫ్ట్‌ ద్వారా నిర్వహించబడుతున్నాయి. తమ సేవలను విస్తరించే క్రమంలో భాగంగా తాజాగా ఐదో ఫ్లైట్‌ సేవల్ని ప్రకటించింది.

ఈ ప్రకటనపై కంపెనీ సౌత్‌ ఆసియా రీజినల్‌ జెనరల్‌ మేనేజర్‌ మార్క్‌ సుచ్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది జూన్‌ నుంచి తమ అదనపై ఫ్లైట్‌ ప్రారంభమవుతుందన్నారు. దీని ద్వారా దేశంలో తమ నెట్‌వర్క్‌ను మరింత దృఢ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజా ఫ్లైట్‌ సేవల ద్వారా హైదరాబాద్‌ పాసెంజర్‌ ప్రయాణంలో తమ కంపెనీ సామర్థ్యం14 శాతం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు