నీరవ్‌కు వ్యతిరేకంగా రెడ్‌కార్నర్‌ నోటీసు

11 Jun, 2018 19:18 IST|Sakshi
నీరవ్‌ మోదీ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో వేల కోట్ల కుంభకోణం పాల్పడిన నీరవ్‌ మోదీకి వ్యతిరేకంగా రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీచేయాలని సీబీఐ కోరుతోంది. ఈ మేరకు ఇంటర్‌పోల్‌కు సీబీఐ లేఖ రాసిందని అధికారులు చెప్పారు. నీరవ్‌ కేసును విచారిస్తున్న మరో దర్యాప్తు సంస్థ ఈడీ కూడా ఆయనకు వ్యతిరేకంగా రెడ్‌కార్నర్‌ నోటీసు జారీచేయాలని ఇంటర్‌పోల్‌ను మార్చిలోనే కోరింది. ఒక్కసారి రెడ్‌కార్నర్‌ నోటీసు జారీచేస్తే, లియోన్ ఆధారిత అంతర్జాతీయ పోలీసు సహకార సంస్థ ఆయన్ని అరెస్ట్‌ చేసే అవకాశముంటుంది. పీఎన్‌బీ కుంభకోణానికి సంబంధించిన కేసులో నీరవ్, చోక్సీపై కొద్ది రోజుల క్రితమే సీబీఐ విడివిడిగా చార్జిషీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

తాజాగా ఈ నిందితులను విచారణ కోసం తిరిగి భారత్‌కు రప్పించాలన్న లక్ష్యంతో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది. దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ చరిత్రలోనే పీఎన్‌బీ కుంభకోణం అతిపెద్దది. ఈ బ్యాంకులో దాదాపు రూ.13వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. ఈ కుంభకోణం వెలుగులోకి రావడానికి చాలా రోజుల ముందే తన భార్య అమీ (అమెరికా పౌరురాలు), సోదరుడు నిశాల్ మోదీ (బెల్జియం పౌరుడు)తో పాటు నీరవ్ మేనమామ, గీతాంజలి గ్రూపు సంస్థల ప్రమోటర్ మెహుల్ చోక్సీతో కలసి భారత్ నుంచి జారుకున్నారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వ్యాపార అవకాశాలకు ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ చైనా ఒప్పందం

భారత్‌లో గో జీరో మొబిలిటీ బైక్‌లు

రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు: ఒడిషా

అపోలో ‘సొసైటీ క్లినిక్స్‌’

11,500 పాయింట్లపైకి నిఫ్టీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వైరల్‌ : సితారా డాన్స్‌ వీడియో..!

సమ్మరంతా సమంత

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ని ఆపడం కుదరదు

‘మా’ను రోడ్డు మీదకు తీసుకురాకండి

ఇక ప్రేమ యుద్ధం

గొప్ప మనసు చాటుకున్న మంచు విష్ణు