ఎయిర్‌ ఏసియా డైరెక్టర్‌కు సమన్లు

29 Jun, 2018 20:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మనీ లాండరింగ్‌  కేసులో  ఎయిర్  ఏసియా ఇండియా డైరెక్టర్ ఆర్ వెంకటరామనన్‌కు  సీబీఐ సమన్లు జారీ చేసింది.  జూలై 3వ తేదీన విచారణకు హాజరు కావాలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్లైన్స్  చెందిన ఫైనాన్షియల్ ఆఫీసర్‌ దీపక్ మహేంద్రను ఇటీవల ప్రశ్నించిన సీబీఐ ఇపుడు వెంకటరామన్‌ను ప్రశ్నించనుంది.  మరోవైపు వాణిజ్యపరిశ్రమల శాఖనుంచి ఎఫ్‌డీఐ పెట్టుబడుల ఆమోదానికి సంబంధించిన పత్రాలను తాజాగా ఈడీ సేకరించింది.

అంత‌ర్జాతీయ విమాన‌యానానికి కావాల‌సిన ప‌ర్మిట్ల‌ను తెచ్చుకొనేందుకు ఎయిర్ ఆసియా భారీ కుంభ‌కోణానికి పాల్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.  విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్‌ఐపీబీ) నిబంధనలను కూడా ఉల్లంఘించారంటూ ఇప్పటికే ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసింది. 5/20 నిబంధన అంటే అంతర్జాతీయ సర్వీసులు నిర్వహించేందుకు లైసెన్స్‌ పొందాలంటే 20 విమానాలు, 5 ఏళ్ళ అనుభవం ఉండాలి. ఇవి లేకుండా విదేశీ లైసెన్స్‌ పొందారనేది సీబీఐ ఆరోపణ. ఈ కేసులో ఎయిర్‌ ఏషియా గ్రూప్‌ సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌ గ్రూప్‌ ఎయిర్‌ ఏషియా, మలేషియా గ్రూప్‌ సీఈఓ, ట్రావెల్‌ ఫుడ్‌ ఓనర్ సునీల్‌ కపూర్‌, డైరెక్టర్‌ ఆర్‌ వెంకట్రామన్‌, ఏవియేషన్‌ కన్సల్టెంట్‌ దీపక్‌ తల్వార్‌, సింగపూర్‌కు చెందిన ఎస్‌ఎన్‌ఆర్‌ ట్రేడింగ్‌ రాజేంద్ర దూబేతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులను ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ చేర్చిన సంగతి  తెలిసిందే.

>
మరిన్ని వార్తలు