సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌కు రూ.27,300 కోట్ల బిడ్‌లు 

1 Dec, 2018 00:26 IST|Sakshi

 ముగిసిన ఫాలో ఆన్‌ ఆఫర్‌ 

17వేల కోట్లు సమీకరిస్తాం: ప్రభుత్వం 

న్యూఢిల్లీ: సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ (ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌) ఫాలో ఆన్‌ ఆఫర్‌ ద్వారా కేంద్రం రూ.17,000 కోట్లకు పైగా సమీకరించనుంది. దేశీయంగా ఒక ఈటీఎఫ్‌ ద్వారా ఈ స్థాయిలో నిధులు సమీకరించడం ఇదే మొదటిసారి. ఈ నెల 27న ఆరంభమైన ఈ ఆఫర్‌ శుక్రవారం ముగిసింది. దీనికి మొత్తం 1.25 లక్షల దరఖాస్తుల ద్వారా రూ.27,300 కోట్ల విలువైన బిడ్‌లు వచ్చాయి. యాంకర్‌ ఇన్వెస్టర్లకు కేటా యించిన వాటా 5.5 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. ఈ కేటగిరీ ఇన్వెస్ట్రర్ల నుంచి రూ.13,300 కోట్లకు బిడ్‌లు వచ్చాయి.

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి రూ.17,000 కోట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.1,200 కోట్ల మేర బిడ్‌లు వచ్చాయి. ప్రావిడెండ్‌ ఫండ్‌ సంస్థ, ఈపీఎఫ్‌ఓ రూ.1,500 కోట్లకు బిడ్‌ దాఖలు చేసింది. సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌లో 11 కంపెనీల షేర్లున్నాయి. ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఐఓసీ, ఆయిల్‌ ఇండియా, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ, భారత్‌ ఎలక్ట్రానిక్స్, ఎన్‌టీపీసీ, ఎస్‌జేవీఎన్, ఎన్‌ఎల్‌సీ, ఎన్‌బీసీసీల షేర్లు ఈ ఈటీఎఫ్‌లో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు