హెచ్‌పీసీఎల్‌లో మొత్తం వాటాల విక్రయం

25 Jul, 2017 02:40 IST|Sakshi
హెచ్‌పీసీఎల్‌లో మొత్తం వాటాల విక్రయం

న్యూఢిల్లీ: చమురు మార్కెటింగ్‌ సంస్థ హిందుస్తాన్‌ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్‌)లో ప్రభుత్వానికి ఉన్న మొత్తం 51.11 శాతం వాటాలను ఓఎన్‌జీసీకి విక్రయించనున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. విలీనానంతరం కూడా హెచ్‌పీసీఎల్‌ ప్రత్యేక బ్రాండ్, బోర్డుతో ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని ఆయన వివరించారు. ఈ డీల్‌తో హెచ్‌పీసీఎల్‌ దేశీయంగా మూడో అతి పెద్ద ఆయిల్‌ రిఫైనర్‌గా మారుతుందని మంత్రి పేర్కొన్నారు.

హెచ్‌పీసీఎల్‌ యాజమాన్య హక్కుల బదలాయింపుతో పాటు 51.11 శాతం వాటాలను ఓఎన్‌జీసీకి వ్యూహాత్మక ప్రాతిపదికన విక్రయించేందుకు  కేంద్ర క్యాబినెట్‌ కమిటీ జూలై 19న సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసిందని లోక్‌సభకు మంత్రి వివరించారు. ఈ డీల్‌ను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి ఈ లావాదేవీ పూర్తి కావొచ్చని పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ప్రధాన్‌ వివరించారు.

మరిన్ని వార్తలు