మేక్‌మైట్రిప్, ఓయోలకు సీసీఐ షాక్‌

25 Feb, 2020 08:35 IST|Sakshi

న్యూఢిల్లీ: అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ఏజెన్సీ మేక్‌మైట్రిప్‌ (ఎంఎంటీ), హోటల్‌ సేవల సంస్థ ఓయోలపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలంటూ కంపిటీషన్‌ కమిషన్‌ (సీసీఐ) ఆదేశించింది. ఓయో ప్రత్యర్థి ట్రీబో హోటల్స్‌ మాతృసంస్థ రబ్‌టబ్‌ సొల్యూషన్స్‌ ఫిర్యాదు మేరకు సీసీఐ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. పోటీ నిబంధనలను ఉల్లంఘించాయన్న ప్రాథమిక ఆధారాలతో ఈ రెండు సంస్థల మీద సీసీఐ విచారణకు ఆదేశించడం ఆరు నెలల వ్యవధిలో ఇది రెండోసారి. ఓయోతో ఒప్పందం కుదుర్చుకున్న ఎంఎంటీ.. తన పోర్టల్‌లో ట్రీబో భాగస్వామ్య హోటళ్లను లిస్ట్‌ చేయకుండా మినహాయించడం, పోర్టల్‌లో చార్జీలపరంగా పరిమితులు విధించడం తదితర అంశాలపై ట్రీబో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన సీసీఐ.. మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని ఎంఎంటీ దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రాథమిక ఆధారాల బట్టి తెలుస్తోందని 13 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. 

మరిన్ని వార్తలు