సిమెంట్ ధరలు పెరుగుతాయ్

11 Feb, 2015 01:58 IST|Sakshi
సిమెంట్ ధరలు పెరుగుతాయ్

రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా
ముంబై: సిమెంట్ ధరలు పెరుగుతాయని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించడంతో డిమాండ్ పుంజుకుంటోందని, ఫలితంగా ధరలు పెరుగుతాయనేది ఇక్రా అంచనా. వర్షాల కారణంగా గత ఏడాది జూలై-సెప్టెంబర్ కాలానికి సిమెంట్ టోకు ధరలు తగ్గాయని (ఉత్తర, పశ్చిమ భారత దేశాల్లో),  అయితే వర్షాకాలం పూర్తయిన తర్వాత ధరల పెరుగుదల స్వల్పంగానే ఉందని ఇక్రా పేర్కొంది.

గత ఏడాది అక్టోబర్‌లో సిమెంట్ ధరలు బస్తాకు రూ..5-20కు పెరిగాయని, కానీ,  నవంబర్, డిసెంబర్‌ల్లో డిమాండ్ లేకపోవడంతో ధరలపై మళ్లీ ఒత్తిడి పెరిగిందని వివరించింది. రానున్న మూడేళ్లలో సిమెంట్‌కు డిమాండ్ 8-8.5 శాతం పెరగనున్నదని, అయితే డిమాండ్‌కు తగ్గట్లుగా ఉత్పత్తి సామర్థ్యం పెరగడం లేదని ఇక్రా వెల్లడించింది.

మరిన్ని వార్తలు