నిరంతరాయ పబ్లిక్‌ వై–ఫై నెట్‌వర్క్‌పై కేంద్రం కసరత్తు

16 Feb, 2019 00:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ వినియోగదారులు బహిరంగ ప్రదేశాల్లో నిరంతరాయంగా పబ్లిక్‌ వై–ఫై సేవలు పొందేలా ఇంటరాపరబిలిటీ విధానాన్ని అమల్లోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది. దీనిపై టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్, సర్వీస్‌ ప్రొవైడర్లతో చర్చలు జరుపుతున్నట్లు టెలికం కార్యదర్శి అరుణ సుందరరాజన్‌ చెప్పారు. ఇది ఇటు వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉండటంతో  పాటు అటు చిన్న స్థాయి ఔత్సాహిక వ్యాపారవేత్తలకు కొంత ఆదాయ వనరుగా కూడా ఉండగలదని ఆమె తెలిపారు.

‘ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌ లాంటి చోట్ల ప్రతీసారి లాగిన్‌ కావాల్సి వస్తోంది. సర్వీస్‌ ప్రొవైడర్‌ వై–ఫైని ప్యాకేజీగా ఇవ్వకపోతే కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా చెల్లించాల్సి వస్తోంది. ఇంటరాపరబిలిటీ అమల్లోకి వస్తే ఒక్కసారి చెల్లించి, లాగిన్‌ అయితే ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సర్వీస్‌ ప్రొవైడర్‌ నుంచైనా నిరంతరాయంగా నెట్‌ సర్వీసులు పొందొచ్చు’ అని చెప్పారు. 

మరిన్ని వార్తలు