సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫలితాలు : షేరు ఢమాల్‌

16 May, 2019 14:40 IST|Sakshi

పెరిగిన ఎన్‌పీఏ కేటాయింపులు

52 వారాల  కనిష్టానికి షేరు పతనం

సాక్షి, ముంబై:   ప్రభుత్వ రంగ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్యూ4లో మరింత  కుదేలైంది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) జనవరి-మార్చి క్వార్టర్‌లో మరింతగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,477 కోట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2017 18) క్యూ4లో రూ. 2,114 కోట్లుగా ఉన్నాయి.  

మొండి బకాయిలకు అధికంగా కేటాయింపులు జరపడం వల్ల క్యూ4లో నికర నష్టాలు భారీగా పెరిగాయని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  ఫలితాల ప్రకటన సందర్భంగా తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.6,301 కోట్ల నుంచి రూ.6,621 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ ఫలితాల నేపథ్యం   బ్యాంకు షేరు 52 వారాల  కనిష్టాన్ని తాకింది.

మరిన్ని వార్తలు