ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల అమలుకు సమన్వయ వ్యవస్థ: కేంద్రం

29 Apr, 2015 01:45 IST|Sakshi
ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల అమలుకు సమన్వయ వ్యవస్థ: కేంద్రం

ముంబై: భారీ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ఆర్‌బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు సంబంధిత వర్గాలు సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆర్థిక శాఖ సూచించింది. మరిన్ని ప్రాజెక్టులు సమస్యల వలయంలో చిక్కుకోకుండా ఈ చర్యలు అవసరమని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి హస్‌ముఖ్ అధియా తెలిపారు. ఇన్‌ఫ్రా రంగ పరిస్థితులపై అధియా సారథ్యంలో ఆర్‌బీఐ, బ్యాంకింగ్, పరిశ్రమ వర్గాలు మంగళవారం సమావేశమయ్యాయి.

విద్యుత్, ఉక్కు తదితర రంగాలకు చెందిన 85 భారీ ప్రాజెక్టులు ఎదురవుతున్న సమస్యలను ఇందులో చర్చించారు. వీటి విలువ సుమారు 3.51 లక్షల కోట్లు ఉంటుందని, ఇందులో 4 శాతం ప్రాజెక్టులు మాత్రమే నిరర్థక ఆస్తులుగా మారాయని అధియా తెలిపారు. ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య, ఐబీఏ చీఫ్ టీఎం భాసిన్, ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ రాజేంద్రన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అధికారులు మొదలైన వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు