బంగారం దిగుమతులు పెరిగే చాన్స్‌!

28 Nov, 2017 01:04 IST|Sakshi

రత్నాలు, ఆభరణాల ఎగుమతుల  ప్రోత్సాహక మండలి అంచనా

న్యూఢిల్లీ: భారత్‌ పసిడి దిగుమతులు– ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) పెరిగే అవకాశం ఉందని రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) అంచనావేసింది. ఈ పరిమాణాన్ని 700 టన్నులుగా మండలి పేర్కొంది. 2016–17లో ఈ పరిమాణం 500 టన్నులు. ఇక్కడ జరిగిన ఒక విలేకరుల సమావేశంలో మండలి చైర్మన్‌ ప్రవీణ్‌ శంకర్‌ పాండ్య మాట్లాడుతూ, 2017–18 వార్షిక బడ్జెట్‌లో దిగుమతుల సుంకాన్ని 4 నుంచి 5 శాతం శ్రేణికి తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

 ప్రస్తుతం ఉన్న 10 శాతం వల్ల బంగారం అక్రమ రవాణా సమస్య ఉంటుందని పేర్కొన్నారు. పరిశ్రమ వృద్ధికి కూడా ఈ స్థాయి దిగుమతి సుంకం సరికాదని అన్నారు. కాగా ఇదే సమావేశంలో మాట్లాడిన మండలి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సవ్యసాచి రాయ్‌ మాట్లాడుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరం దిగుమతులు పెరుగుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పసిడి విధానాన్ని వచ్చే బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు