చందా కొచర్‌కు ఉద్వాసన?

18 Jun, 2018 11:44 IST|Sakshi
ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ చందా కొచర్‌ (పాత ఫోటో)

తాత్కాలిక సీఈవోగా సందీప్‌ బక్షికి బాధ్యతలు?

మేనేజ్‌మెంట్‌ పునర్వవస్థీకరణకు బోర్డు కసరత్తు

సాక్షి, ముంబై: వీడియోకాన్‌ రుణ వివాదంలో చిక్కుకున్న ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ చందా కొచర్‌కు బోర్డు షాక్‌ ఇవ్వనుందా?  బ్యాంకులో ఆమె భవితవ‍్యం నేడు తేలనుందా? ఈ కుంభకోణంపై విచారణ నేపథ్యంలో  సీఈవో పదవినుంచి ఉద్వాసన పలకనున్నారా?  నేడు జరగనున్న ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు సమావేశంలో ఈ కీలక ప్రశ్నలకు  సమాధానం దొరకనుంది. బ్యాంకు మేనేజ్‌మెంట్‌ పునర్వవస్థీకరణపై బోర్డు డైరెక్టర్లు చర్చించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. బ్యాంకుకు చెందిన  లైఫ్ ఇన్సూరెన్స్ వెంచర్ ప్రుడెన్షియల్‌ లైఫ్‌కు సీఈఓ సందీప్ బక్షిని  ఐసీఐసీఐ బ్యాంకు  తాత్కాలిక  సీఈవోగా  ఎంపిక చేయనున్నట్టు  తెలుస్తోంది.  ఆరోపణలపై విచారణ పూర్తయ్యేంత వరకు నిరవధిక సెలవులో వెళ్లమని బోర్డు కోరనుందని భావిస్తున్నారు. అలాగే బీఎన్‌ కృష్ణ విచారణ ప్రతిపాదనకు ఆమోదం, తదుపరి కార్యాచరణపై  సమగ్రంగా ఈ సమావేశం చర్చించనుంది. ఈ వార్తలపై  బ్యాంకు బోర్డు అధికారికంగా స‍్పందించాల్సి ఉంది.

1986లో సందీప్‌ బక్షి ఐసీఐసీఐ బ్యాంకులో చేరారు.  2010 నుంచి ఆగస్టు నుంచి ప్రుడెన్షియల్‌ లైఫ్‌కు సీఈఓగా పనిచేస్తున్నారు. అంతకుముందు 2009-10 మధ్య కాలంలో బ్యాంకుకు చెందిన రిటైల్‌  సంస్థకు డిప్యూటీ ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. కాగా బ్యాంకు సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచర్‌పై వచ్చిన ఆర్థిక అభియోగాలకు సంబంధించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలోని స్వత్రంత  కమిటీ విచారణకు ఆమోదం తెలిపారు.  కొచర్‌ భర‍్త దీపక్‌ కంపెనీకి ఆర్థిక ప్రయోజనాలు కల్పించే విధంగా చందా కొచర్ వ్యవహరించారనే అభియోగాలొచ్చిన విషయం విదితమే.

>
మరిన్ని వార్తలు