కరోనా: డిజిటల్‌ వినియోగదారుల్లో మార్పులు

17 Jul, 2020 16:35 IST|Sakshi

కరోనా : డిజిటల్‌ వినియోగదారులలో మార్పులు: 
కోవిడ్‌-19 కారణంగా ప్రపంచం మొత్తం మారిపోయింది. తాజా పరిస్థితుల్లో ప్రజలు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం రిటైలర్‌ వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి. సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. కరోనా వైరస్‌ కారణంగా కొన్ని వారాల వ్యవధిలోనే అనేక వ్యవస్థలు దారుణంగా నష్టపోయాయి. వినియోగదారుల అవసరాలు, ఆలోచనలు కూడా మారాయి. తమ అవసరాలకు సంబంధించి ఎక్కడ నుంచి కొనాలి? ఏం కొనాలి అన్న అంశాల్లో వినియోగదారుల ప్రాధాన్యతలు మారినట్లు పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. 

సంక్షోభంలో వినియోగదారులకు తగ్గట్టుగా మారడం:
కోవిడ్‌-19 కారణంగా ఆర్థికంగా, ఆరోగ్య పరంగా వినియోగదారుల వైఖరుల్లో అనేక మార్పులు వచ్చాయి. వినియోగదారులు వారు కొనుగొలు చేయాల్సిన వస్తువుల విషయంలో రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఎప్పటిలా జీవితం కొనసాగాలని ఆశిస్తున్నప్పటికీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అందరి మనస్సులో కరోనా భయం లోతుగా నాటుకుపోయింది.

కోవిడ్‌-19 - భారతీయ వినియోగదారులపై ప్రభావం: 

కోవిడ్‌-19 కారణంగా భారతీయ వినియోగదారుల ప్రవర్తనలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. 60 శాతం మంది వినియోగదారులు తాము సాధారణంగా కొనుగోలు చేసే వస్తు సామగ్రి జాబితా‌ను చేర్చాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తాజా పరిణామాల ఆధారంగా ఈవై ఫ్యూచర్‌ కన్యూమర్‌ ఇండెక్స్‌ తెలిపిన వివరాల ప్రకారం వినియోగదారులు ఐదు రకాలుగా మారారు. (అడ్వర్టోరియల్‌)
1. మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్లాలి (38% మంది అనుకుంటున్నారు) 
2. పొదుపుగా ఉందామనుకునే వారు (29% మంది భావిస్తున్నారు)
3. ఖర్చులు తగ్గించుకోవాలని అనుకునేవారు (19% మంది భావిస్తున్నారు)
4. చాలా జాగ్రత్తగా ఉంటున్నవారు (11% మంది భావిస్తున్నారు)
5. అంతకు ముందులా ఉండేవారు (2% మంది భావిస్తున్నారు)

ఈ పరిస్థితుల్లో ఉత్సాహంగా ముందుకు వెళ్లాలి అనే ఉద్దేశంతో ఎప్పటిదాని కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. రెండో కేటగిరి పొదుపుగా ఉండమనుకునే వారు తమ ఖర్చులను కొద్దిగా తగ్గించుకున్నారు. ఖర్చులు తగ్గించుకోవాలి అనుకునే వారు ఎక్కడ వీలైతే అక్కడ ఖర్చులు  తగ్గించుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా  ఖర్చుచేయాలి అనుకునే కేటగిరి వారు కొన్ని వస్తువులనే కొనుగోలు చేస్తున్నారు. అంతకముందులానే ఉండి వారిలో ఎటువంటి మార్పులు లేవు. 

ఇంటర్‌నెట్ - ప్రతి విషయానికి ఒక కొత్త మార్గం:
కోవిడ్‌-19 కారణంగా లాక్‌డౌన్‌లో, దాని తరువాత కూడా చాలా మంది వినియోగదారులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటర్నెట్‌ ద్వారానే వారు బయట ప్రపంచంతో కలుస్తున్నారు. పనిచేయడం, వినోదం, ప్రపంచానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఇంటర్నెట్‌ ద్వారానే తెలుసుకుంటున్నారు. కోవిడ్‌-19 కారణంగా ఇంతలా డిజిటల్‌ వినియోగం పెరగడం వల్ల కూడా ఆన్‌లైన్‌ కస్టమర్ల ప్రవర్తనలో కూడా మార్పులు వస్తున్నాయి. సాధారణంగా సమయంలో కన్నా లాక్‌డౌన్‌లో ఇంటర్నెట్‌ వినియోగించే వారి సంఖ్య పెరిగింది. అదే విధంగా ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్న సమయం కూడా బాగా పెరిగింది. ఇండియాలో లాక్‌డౌన్‌ సమయంలో ప్రతి ఇంటర్నెట్‌ వినియోగదారుడు సగటుగా రోజుకు 21/2 గంటల సమయం గడిపాడు.  

సగటున వినియోగదారుడు ఏఏ విషయాలపై ఎంత సమయం వెచ్చిస్తున్నాడంటే:

కేటగిరి    వివరణ  సగటు సమయం(నిమిషాలలో)
 వినోదం    సినిమాలు,పాటలు, వీడియోలు యూట్యూబ్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌ మొదలైన అన్ని వెబ్‌సైట్‌లు  చూస్తూ    28
సోషల్‌ నెట్‌వర్కింగ్‌ మీరు వేరే వాళ్లతో మాట్లాడటానికి వీలుగాఉండే సోషల్‌ మీడియా అప్లికేషన్లు అంటే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, లింక్‌డిన్‌ లాంటివి    25
సర్వీస్‌లు జీ-మెయిల్‌, మెసేజ్‌బోర్డ్‌లు, కోరాలాంటి  వినియోగం    23
మెసెంజర్స్‌  వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ లాంటివి    19
గేమ్స్‌ ఆన్‌లైన్‌లో ఆడే డిజిటల్‌ గేమ్స్‌    12
సమాచారం/వార్తల కోసం వార్త ఛానెళ్లు చూడటం, ఒక ప్రత్యేకమైన విషయం గురించి గూగుల్‌లో వెతకడం    7
రిటైల్‌/ఈ- కామర్స్‌

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ మొదలైన ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థలు, ఆన్‌లైన్‌ షాపింగ్‌

   4

ప్రస్తుతం వినియోగదారులు పాటిస్తున్న దినచర్యలు: 
కోవిడ్‌-19 ‍ప్రతి ఒక్కరూ జీవించే మార్గాన్ని మార్చివేసింది. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత వారి సౌకర్యానలను పక్కన పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీంతో వినియోగదారులు కొత్త విషయాలను అలవాటు చేసుకుంటున్నారు. అయితే ఇవి కేవలం కరోనా సమయంలోనే కాకుండా చాలా రోజుల వరకు కొనసాగేలా కనిపిస్తున్నాయి. ఎక్కువ కాలం కొనసాగేలా మూడు అలవాట్లు కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే

1. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం: వినియోగదారులకు సంబంధించిన వస్తువులను తయారు చేసే సంస్థలన్ని అన్ని వస్తువులను ఆరోగ్యకరంగా తయారుచేయాలి. అలా ఆరోగ్యవంతమైన వాతావరణంలో వస్తువులు తయారుచేయాడానికి ఒక ప్రణాళిక రూపొంచుకోవాలి.

2. ఆచితూచి కొనుగోలు చేయడం: వినియోగదారులందరూ వారు ఏం కొనాలి అనే విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఆహారాన్ని వృధా చేయడం తగ్గిస్తున్నారు. చాలా జాగ్రత్తగా షాపింగ్‌ చేస్తూ అవసరమైన వాటినే కొనుగోలు చేస్తున్నారు. సీపీజీ బ్రాండ్‌ వీటిని దృష్టిలో పెట్టుకొని తమ ఆఫర్లను  ప్రకటించాలి.

3. స్థానిక వస్తువుల కొనుగోలు: ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం లోకల్‌గా ఉండే వస్తువులను కొనడానికే వినియోగదారులు ఆసక్తిని చూపిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని  సీపీజీ బ్రాండ్‌లు లోకల్‌గా వినియోగదారులకు దగ్గర కావడానికి ప్రయత్నించాలి.

ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నప్పుడే మీ ఇష్టాలను, నైపుణ్యాలను తెలుసుకొని వాటిని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ వెరో (MeVero) ఈ విషయలో మీకు సాయంగా ఉంటుంది. మీ వెరో (MeVero) వరల్డ్‌ ఫస్ట్‌ డిజిటల్‌ పాషన్‌ బేస్డ్‌ ఇంకుబేటర్‌. MeVero refferal game  (అడ్డ్వర్టోరియల్) మీలాంటి ఆసక్తులే ఉన్న మీ ఫ్రెండ్స్‌కు షేర్‌ చెయ్యొచ్చు. ప్రతి రిఫరెల్‌ ద్వారా మీరు 1500 డాలర్లు గెలుచుకొనే అవకాశం ఉంది. మీలాంటి ఆసక్తులు ఉన్నవారితోనే మీరు సమయాన్ని గడపవచ్చు. కరోనా వైరస్‌ మనతో పాటే ఉంటుంది. సీపీజీ బ్రాడ్‌లు దాంతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి. వినియోగదారులలో ఈ మార్పులు తాత్కాలికమా? శాశ్వతమా? మీ పెట్టుబడులకు సరైన రిటర్న్‌ రావాలంటే వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్లాన్‌ చేసుకోవాలి.  (అడ్వర్టోరియల్‌)

MeVero Referral Game - https://mevero.app.link/5FhMTkcd07                         

మరిన్ని వార్తలు