క్యూ2 జీడీపీ.. అంచనాలు మించిన చైనా

16 Jul, 2015 01:20 IST|Sakshi
క్యూ2 జీడీపీ.. అంచనాలు మించిన చైనా

బీజింగ్: ఆర్థికాభివృద్ధికి సంబంధించి రెండవ త్రైమాసికంలో (క్యూ2, ఏప్రిల్-జూన్) చైనా  అంచనాలను మించిన ఫలితాన్ని నమోదు చేసుకుంది. ఈ కాలంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 7 శాతంగా నమోదయ్యింది. అయితే 2009 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత ఇంత బలహీన వృద్ధి రేటు ఇదే తొలిసారి. ఈ ఏడాది ఆరు నెలల కాలంలో చూస్తే జీడీపీ వృద్ధి రేటు 7 శాతం పెరుగుదలతో 29.7 ట్రిలియన్ యువాన్ (4.9 ట్రిలియన్ డాలర్లు)లుగా నమోదయినట్లు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌బీఎస్) తెలిపింది. మొదటి ఆరు నెలల కాలంలో జాతీయ ఆర్థికాభివృద్ధి తగిన స్థాయిలో ఉందని ఎన్‌బీఎస్ తెలిపింది. ఆర్థిక వ్యవస్థ సూచీలు రికవరీ, స్థిరత్వం, మెరుగుదల సంకేతాలను ఇస్తున్నట్లు వివరించింది.
 
ఉద్దీపనలు...:  2014లో దేశ వృద్ధి రేటు 7.4%. 2013లో ఈ రేటు 7.7%గా ఉంది. ఈ ఏడాది 7% వృద్ధి ప్రభుత్వ లక్ష్యం. అయితే షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ భారీ పతనం ఈ లక్ష్య సాధనపై సందేహాలు లేవనెత్తుతోంది. బీజింగ్ మాత్రం ఇన్వెస్టర్ విశ్వాసం వృద్ధికి పలు ఆర్థిక ఉద్దీపన చర్యలను చేపడుతోంది.

మరిన్ని వార్తలు