చైనా లిక్విడిటీ బూస్ట్‌!

8 Oct, 2018 01:12 IST|Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ 1 శాతం కోత...

వ్యవస్థలోకి 109 బిలియన్‌ డాలర్లు  

బీజింగ్‌: అమెరికాతో ముదురుతున్న వాణిజ్య యుద్ధం, మందగమనం కారణంగా ఆపసోపాలు పడుతున్న చైనా ఆర్థిక వ్యసవ్థకు జోష్‌నిచ్చేందుకు ఆ దేశ కేంద్ర బ్యాంక్‌ చర్యలను ముమ్మరం చేసింది. బ్యాంకుల రిజర్వ్‌ రిక్వైర్‌మెంట్‌ రేషియో(ఆర్‌ఆర్‌ఆర్‌)ను ఏకంగా ఒక శాతం తగ్గిస్తున్నట్లు పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా(పీబీఓసీ) ప్రకటించింది. ఈ నెల 15 నుంచి ఈ కోత అమల్లోకి వస్తుందని వెల్లడించింది. తాజా నిర్ణయంతో చైనా బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి 109.2 బిలియన్‌ డాలర్ల మేర నగదు(లిక్విడిటీ) అదనంగా అందుబాటులోకి రానుంది.

ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మరింత మందగిస్తుందన్న సంకేతాల నేపథ్యంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోకి బిలియన్ల కొద్దీ డాలర్లను కుమ్మరిస్తోంది. ఇందులో భాగంగానే బ్యాంకుల రుణ వృద్ధిని పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది పీబీఓసీ ఆర్‌ఆర్‌ఆర్‌ను తగ్గించడం ఇది నాలుగోసారి. 

మరిన్ని వార్తలు