జడ్‌టీఈ నుంచి ఆరు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

20 Jul, 2013 06:17 IST|Sakshi
జడ్‌టీఈ నుంచి ఆరు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

ముంబై: చైనాకు చెందిన జడ్‌టీఈ కంపెనీ ఆరు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను శుక్రవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రానున్న 3-4 ఏళ్లలో హై ఎండ్ కేటగిరి మొబైల్ ఫోన్ల మార్కెట్లో 20-25 శాతం వాటా సాధించడం లక్ష్యమని జడ్‌టీఈ ఇండియా వైస్ ప్రెసిడెంట్(హ్యాండ్‌సెట్స్) యువాన్ కాంగ్ చెప్పారు. రూ. 5,000 నుంచి రూ.15,000 రేంజ్‌లో ఆరు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను, నాలుగు డేటా కార్డ్ డివైస్‌లను అందిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రస్తుతం 35 కోట్ల డాలర్లుగా ఉన్న భారత స్మార్ట్‌ఫోన్, డేటా కార్డ్ మార్కెట్ 3-4 ఏళ్లలో వంద కోట్ల డాలర్లకు పెరుగుతుందని అంచనాలున్నాయని వివరించారు. తొలి ఏడాదిలో పది లక్షల స్మార్ట్‌ఫోన్‌లు, 5 లక్షల డేటా కార్డ్ డివైస్‌లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి తమకు చైనా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు కీలక మార్కెట్లని వివరించారు.

మరిన్ని వార్తలు