ఫియట్‌ కార్ల ధరలు తగ్గాయ్‌

6 Jan, 2017 01:25 IST|Sakshi
ఫియట్‌ కార్ల ధరలు తగ్గాయ్‌

న్యూఢిల్లీ:   ఇతర వాహన కంపెనీలన్నీ వాటి కార్ల ధరల పెంపులో నిమగ్నమై ఉంటే.. ఫియట్‌ క్రిస్లర్‌ ఆటోమొబైల్స్‌ (ఎఫ్‌సీఏ) ఇండియా మాత్రం వీటికి భిన్నంగా మరంత మంది కస్టమర్ల ఆకర్షించడం కోసం కార్ల ధరల్లో కోత విధించింది. తన సెడాన్‌ కారు లీనియా ధరను 7.3 శాతం వరకు (రూ.77,121 వరకు)..

హ్యాచ్‌బ్యాక్‌ కారు పుంటో ఈవో ధరను దాదాపు 7 శాతం వరకు (రూ.47,365 వరకు) తగ్గించింది. దీంతో లీనియా కార్ల ధర రూ.7.25 లక్షల నుంచి రూ.9.99 లక్షల శ్రేణికి తగ్గింది. కాగా వీటి ఇదివరకు ధర రూ.7.82 లక్షల నుంచి రూ.10.76 లక్షల శ్రేణిలో ఉంది. ఇక పుంటో ఈవో కార్ల ధర కూడా రూ.5.45 లక్షలు – రూ.7.55 లక్షల శ్రేణికి తగ్గింది. వీటి ఇదివరకు ధర రూ.5.85 లక్షలు– రూ.7.92 లక్షల శ్రేణిలో ఉంది. కాగా ఈ ధరలన్నీ ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీవి.

మరిన్ని వార్తలు