వచ్చే ఏడాదిలో సిట్రోయెన్‌ ‘సీ5 ఎయిర్‌క్రాస్‌’..!

9 Dec, 2019 00:46 IST|Sakshi

న్యూఢిల్లీ: యూరోపియన్‌ ఆటో దిగ్గజం గ్రూప్‌ పీఎస్‌ఏ.. వచ్చే ఏడాదిలో తన సిట్రోయెన్‌ బ్రాండ్‌ కార్లను ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా తొలుత ‘సీ5 ఎయిర్‌క్రాస్‌’ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌ (ఎస్‌యూవీ)ని విడుదలచేయనున్నట్లు వెల్లడించింది. కంపెనీ ప్రణాళిక ప్రకారం.. ఈ ఏడాదే ఎస్‌యూవీ విడుదల కావాల్సి ఉన్నా, తొలికారు విషయంలో రాజీలేకుండా ఉండటానికే మరింత సమయం తీసుకున్నట్లు సంస్థ భారత సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ రోలాండ్‌ బౌచారా అన్నారు.

మరిన్ని వార్తలు