ఇండిగో నిర్వాకంపై కేంద్రమంత్రి సీరియస్‌

8 Nov, 2017 15:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాణికుడిపై  ఇండిగో ఎయిర్‌లైన్స్‌  సిబ్బంది చేయిచేసుకున్న ఘటనపై   పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు  బుధవారం స్పందించారు. ప్రయాణికుడు సంజయ్‌ కత్వాల్‌పై దాడిని  ఖండించిన   కేంద్రమంత్రి,   ఈ ఉదంతంపై స్వతంత్ర నివేదిక సమర్పించాల్సిందిగా  డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ని ఆదేశించారు. అలాగే ఇండిగో  సిబ్బందిపై  చట‍్టపరమైన చర్యలు తీసుకుంటామని అశోక్‌ గజపతి రాజు చెప్పారు. ఇలాంటి  అనాగరిక విషయాలు జరగకూడదన్నారు. విచారణ  అనంతరం తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

మరోవైపు  ఇండిగో సిబ్బంది దురుసు  ప్రవర‍్తన వ్యవహారం వీడియోసాక్షిగా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో  ఇండిగో ఎయిర్‌ లైన్స్‌ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. ప్రయాణికుడిని స్వయంగా కలిసి  ఎయిర్‌లైన్స​ డైరెక్టర్‌  దాడి ఘటన పట్ల విచారం వ్యక‍్తం  చేస్తూ. క్షమాపణలు చెప్పారు.

కాగా  ఈ సంఘటన అక్టోబర్ 15  ఢిల్లీ విమానాశ్రయంలో  ఈ ఘటన చోటు చేసుకోగా తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెట్‌లో కలకలం రేపింది.  వీడియో వెలుగులోకి  వచ్చిన  వెంటనే, విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా  కూడా ఈ సంఘటనను ఖండించారు. రిపోర్టు ఇవ్వాల్సిందిగా వైమానిక సంస్థ  ఇండిగో కోరారు. అటు ఈ దాడిపై బీజేపీ కూడా మండిపడుతోంది.  ప్రయాణీకుల పట్ల ఇండిగో  సంస్థ  సిబ్బంది  అమర్యాద  ప్రవర్తన గర్హనీయమని, యాజమాన్య స్పందన  చాలా  దారుణంగా ఉందంటూ షానవాజ్‌ హుస్సేన్‌ మండిపడ్డారు.

>
మరిన్ని వార్తలు