-

200-250 ఎగ్జిక్యూటివ్‌లపై వేటు

28 Nov, 2017 11:39 IST|Sakshi

న్యూఢిల్లీ : గ్లోబల్‌ బెవరేజ్‌ దిగ్గజం కోకా-కోలా చరిత్రలోనే అతిపెద్ద మేనేజ్‌మెంట్‌ పునరుద్దరణ జరుగబోతుంది. భారత్‌లో 200 నుంచి 250 మంది సీనియర్‌, మధ్య స్థాయి ఎగ్జిక్యూటివ్‌లపై ఈ కంపెనీ వేటు వేయాలని చూస్తోంది. హిందూస్తాన్‌ కోకా-కోలా బెవరేజస్‌కు చెందిన పలువురు టాప్‌-ఎగ్జిక్యూటివ్‌లు ఈ విషయాన్ని ధృవీకరించారు. వీరిలో కొందరు తక్కువ సీనియర్ బాధ్యతలకు, మరికొందరు వేరే ప్రదేశాలకు మారతామని అడిగినట్టు హెచ్‌సీసీబీ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు. హెచ్‌సీసీబీ ప్రస్తుతం ఆపరేట్‌ చేస్తున్న ఐదు జోన్ల మాదిరిగా కాకుండా ఏడు జోన్లను ఆపరేట్‌ చేయాలనుకుంటోంది. జోన్స్‌, ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి వీలుగా కంపెనీ తన కార్పొరేట్‌ సెంటర్‌ రిసోర్సస్‌ను పునర్వ్యస్థీకరిస్తోంది. 

ఈ క్రమంలోనే వందల కొద్దీ కొత్త ఉద్యోగాలను కూడా సృష్టించబోతుంది. ప్రస్తుతం రెడడెంట్‌గా ఉన్న ఉద్యోగాలను తొలగించడానికి ఈ పునర్‌వ్యవస్థీకరణ చేపడుతోంది. ఈ ఉద్యోగాల తొలగింపు ఎక్కువగా హెచ్‌ఆర్‌, స్పెషల్‌ ప్రాజెక్టులు, రూట్‌-టూ-మార్కెట్‌, ప్రత్యామ్నాయ బెవరేజ్‌ వంటి కీలక పోస్టులపై ప్రభావం చూపనుందని తెలుస్తోంది. ఐటీ, ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్ల ఎగ్జిక్యూటివ్‌లపై కూడా ప్రభావం చూపనుంది. గత రెండేళ్లుగా జోర్హట్‌(అస్సాం), బైరనిహాట్ (మేఘాలయ), కలేదారా (జైపూర్), విశాఖపట్నం(ఏపీ), మౌలా అలీ(తెలంగాణ), హాస్పెట్‌(కర్నాటక) ప్లాంట్లను హెచ్‌సీసీబీ మూసివేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హెచ్‌సీసీబీ 21 ఫ్యాక్టరీలను కలిగి ఉంది. ఆర్థిక సంవత్సరం 2017 మార్చి ముగింపు వరకు కంపెనీ రూ.9,472 కోట్ల రెవెన్యూలను కలిగి ఉంది. 

మరిన్ని వార్తలు