కాఫీ డే...కలసివచ్చిన ‘మైండ్‌ ట్రీ’ వాటా విక్రయం

14 Nov, 2019 10:22 IST|Sakshi

కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీ నికర లాభం జూన్‌ క్వార్టర్లో భారీగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో (ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్‌) రూ.21 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,567 కోట్లకు పెరిగిందని కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. ఐటీ కంపెనీ మైండ్‌ట్రీలో వాటా విక్రయం కారణంగా వచ్చిన అసాధారణ లాభాల కారణంగా ఈ క్యూ1లో నికర లాభం ఈ స్థాయిలో వృద్ధి చెందిందని తెలియజేసింది. మొత్తం ఆదాయం రూ.966 కోట్ల నుంచి రూ.942 కోట్లకు తగ్గిందని పేర్కొంది. షేర్‌ 5% లాభంతో రూ.43 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు