కాగ్నిజెంట్‌ నిర్ణయంతో టెకీలకు షాక్‌..

23 Nov, 2019 16:41 IST|Sakshi

బెంగళూర్‌ : ఐటీ కంపెనీలు ఉద్యోగుల కోతకు దిగుతుండటంతో రానున్న నెలల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఊపందుకోనుంది. ప్రాజెక్టులు లేని ఉద్యోగుల బెంచ్‌ టైమ్‌ గరిష్ట పరిమితిని ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ తగ్గించడం ఉద్యోగుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. బిల్లింగ్‌ ప్రాజెక్టులపై లేని ఉద్యోగుల బెంచ్‌ టైమ్‌ను 60 రోజుల నుంచి 35 రోజులకు కాగ్నిజెంట్‌ తగ్గించింది. 35 రోజుల తర్వాత బెంచ్‌పై ఉన్న ఉద్యోగులను కంపెనీ సాగనంపుతుంది. ఈ ప్రక్రియ 60 నుంచి మూడు నెలల లోపు పూర్తవుతుంది.

గతంలో బెంచ్‌పై ఉన్న ఉద్యోగులకు తమ బిజినెస్‌ యూనిట్లలో లేదా ఇతర ప్రాజెక్టుల్లో అవకాశం పొందేందుకు అధిక గ్రేస్‌ టైమ్‌ను కంపెనీ కల్పించేది. ఇతర నగరాలకు వెళ్లేందుకు ఇష్టపడని ఉద్యోగులు, ఇతర డొమైన్లను ఎంచుకోని వారు మాత్రమే కంపెనీని వీడాల్సివచ్చేది. బెంచ్‌పై ఉన్న ఉద్యోగులకు పలు అవకాశాలు ఇవ్వకుండా నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకునే నైపుణ్యాలను వారు విధిగా మెరుగుపరుచుకునేలా ఒత్తిడి పెంచేందుకే కాగ్నిజెంట్‌ నూతన బెంచ్‌ విధానాన్ని అనుసరిస్తున్నట్టు భావిస్తున్నారు. సంవత్సరాల తరబడి రెండంకెల వృద్ధిని నమోదు చేసిన కాగ్నిజెంట్‌ వృద్ధి రేటు ఇటీవల పడిపోవడంతో తిరిగి మెరుగైన వృద్ధిని సాధించేందుకు పలు చర్యలు చేపడుతోంది. మారుతున్న క్లయింట్‌ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులు నైపుణ్యాలను సంతరిచుకునేలా కసరత్తు చేపట్టింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వన్‌ప్లస్‌ వినియోగదారులకు షాకింగ్‌ న్యూస్‌

ఆన్‌లైన్‌ కొనుగోళ్లలో ‘మొబైల్‌’ జోరు...

రాష్ట్రాల ఆర్థిక కమిషన్లను వ్యవస్థీకరించాలి: దాస్‌ 

జీవితకాల గరిష్ట స్థాయికి ఫారెక్స్‌ నిల్వలు 

మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యాపారంలోకి ముత్తూట్‌ ఫైనాన్స్‌ 

మహీంద్రా కొత్త ఈక్విటీ స్కీం 

ఇతర మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్‌ బెస్ట్‌

బీపీసీఎల్, కాంకర్‌ విక్రయానికి బిడ్‌లు

భారత రాజకీయాలపై ఆర్థిక అభద్రతా ప్రభావం

ఐటీ, బ్యాంకు షేర్లలో అమ్మకాలు

వేల కోట్ల కుంభకోణం : కార్వీకి సెబీ షాక్!

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ పరిష్కార ప్రక్రియ వేగవంతం

ఏజీఆర్‌పై సుప్రీంలో టెల్కోల రివ్యూ పిటిషన్‌

‘వీర’ అనంతపురం ప్లాంటు...

విదేశీ పెట్టుబడులకు గాలం

టెస్లా కారు లాంచ్‌లో నవ్వులపాలు

అద్భుత ఫీచర్లు, బడ్జెట్‌ ధర ‘యూ 20’

ఐటీ షేర్ల షాక్‌ : నష్టాల్లోకి సూచీలు

ఉబర్‌ యాప్‌లో ఇక ‘నిఘా ఫీచర్‌’

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు 

పేలిన రెడ్‌మి నోట్‌ స్మార్ట్‌ఫోన్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్న యూజర్లు...

సోషల్‌ మీడియాకు కొత్త ఐటీ నిబంధనలు..

అక్టోబర్‌లో రుణాల పంపిణీ రూ.2.5 లక్షల కోట్లు

రెడ్డీస్‌ నుంచి ఐదేళ్లలో 70 ఔషధాలు

లాభాల స్వీకరణతో మార్కెట్‌ వెనక్కి..

వచ్చే నెల 10న బ్యాంక్‌ యూనియన్ల ధర్నా

బీపీసీఎల్‌ రేసులో పీఎస్‌యూలకు నో చాన్స్‌

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సత్వర పరిష్కారంపై ఎస్‌బీఐ ఆశలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భార్య షాలిని బర్త్‌డేకు అజిత్‌ సర్‌ప్రైజ్‌..

బాలీవుడ్‌ నటి షబానా అజ్మీ తల్లి కన్నుమూత

అదిరిపోయిన ‘తలైవి’ ఫస్ట్‌లుక్‌

ఏం జరిగినా మన మంచికే: సాయిపల్లవి

నటికి గుండెపోటు.. విషమంగా ఆరోగ్యం

చైతూ బర్త్‌డే.. సామ్‌ హార్ట్‌ టచింగ్‌ పోస్ట్‌