ఆర్సెలర్‌ మిట్టల్‌ చేతికి  ఎస్సార్‌ స్టీల్‌ ! 

21 Sep, 2018 01:35 IST|Sakshi

ఆమోదం తెలిపిన సీసీఐ  

న్యూఢిల్లీ: రుణ భారంతో కుదేలైన ఎస్సార్‌ స్టీల్‌ టేకోవర్‌కు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదం తెలిపింది.  ఆర్సెలర్‌ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పన్‌ స్టీల్‌ అండ్‌ సుమిటొమో మెటల్‌ కార్పొరేషన్‌ల కన్సార్షియమ్‌ ఎస్సార్‌ స్టీల్‌ కంపెనీని  టేకోవర్‌ చేయనున్నది. ఎస్సార్‌ స్టీల్‌ కంపెనీ 30కు పైగా బ్యాంక్‌లకు రూ.45,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది.

ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ నడుస్తోంది. ఎస్సార్‌ స్టీల్‌ను చేజిక్కించుకోవడానికి రష్యాకు చెందిన వీటీబీ గ్రూప్‌కు చెందిన న్యూమెటల్‌ కంపెనీ కూడా పోటీ పడింది. న్యూమెటల్‌ కంపెనీ రూ.37,000 కోట్లు ఆఫర్‌ చేయగా, ఆర్సెలర్‌ మిట్టల్‌ కన్సార్షియమ్‌ రూ.42,000 కోట్లు ఆఫర్‌ చేసింది. మరోవైపు భూషణ్‌ స్టీల్‌ను కొనుగోలు చేయడానికి జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు కూడా సీసీఐ ఆమోదం తెలిపింది. 

>
మరిన్ని వార్తలు