ముంబై ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం

31 Jul, 2018 18:52 IST|Sakshi

సాక్షి, ముంబై: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. ముంబై ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో కంప్యూటర్‌ వ్యవస్థ స్థంభించడంతో  సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  విమాన రాకపోకలకు దాదాపు గంట ఆలస్యం కావచ్చని భావిస్తున్నారు. దీంతో విమాన ప్రయాణీకులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.  

కంప్యూటర్‌ సేవల్లో వైఫల్యంగా కారణంగా  దేశీయంగా, అంతర్జాతీయంగా  అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన ముంబై ఎయిర్‌ పోర్ట్‌లో  చెక్‌-ఇన్‌ సేవలకు బాగా ఆలస్యం మవుతోంది. కార్యక్రమాలను, సేవలను మాన్యువల్‌గా నిర్వహిస్తున్నారు. మరోవైపు ఈ  పరిస్థితిని సాధారణ స్థితికి  తెచ్చేందుకు  అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు.

మరిన్ని వార్తలు