ద్రవ్యోల్బణం డేటా కీలకం..

14 Mar, 2016 02:54 IST|Sakshi
ద్రవ్యోల్బణం డేటా కీలకం..

దేశీయ ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్ కదలికలకు కీలకమని విశ్లేషకులు అంటున్నారు. సోమవారంనాడు వెలువడే ఫిబ్రవరి నెల రిటైల్, టోకు ద్రవ్యోల్బణం,ఆర్‌బీఐ రేటు నిర్ణయం వంటి అంశాలపై ప్రధానంగా ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ సింఘానియా చెప్పారు. ద్రవ్యోల్బణం గణాంకాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వెలువడే సంకేతాలు, ఎఫ్‌ఐఐల పెట్టుబడులు, క్రూడ్ ధరల చలనం వంటి అంశాలు సమీప భవిష్యత్తులో మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ  గాడియా తెలిపారు. అమెరికా ఫెడ్ 15-16 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించే సమావేశం ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తుందని ఆయన వివరించారు.
 
స్వల్పకాలిక కరెక్షన్!: గత అంచనాలకు భిన్నంగా ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ బుల్లిష్‌గా మారింది. వివిధ రంగాల షేర్లపై ఈ సెంటిమెంట్ ప్రభావం కన్పిస్తోంది. బాగా బుల్లిష్ సెంటిమెంట్ నెలకొన్నందున, స్వల్పకాలికంగా చిన్నపాటి కరెక్షన్ జరిగే అవకాశం లేకపోలేదని శామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోదీ చెప్పారు.

అయితే అంతర్లీనంగా మార్కెట్ పటిష్టంగానే వుంటుందని, తదుపరి ట్రెండ్ నెలకొనేముందు, సూచీలు హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని ఆయన అంచనావేశారు.వరుసగా రెండోవారం దేశీయ సూచీలు పెరుగుదలతో ముగిసాయి. రెపోను తగ్గించవచ్చన్న అంచనాలతో ఎఫ్‌పీఐలు ఈక్విటీ మార్కెట్లో ఈ నెలలో ఇప్పటివరకూ రూ. 8,000 కోట్లు నికరంగా పెట్టుబడి చేశారు.

మరిన్ని వార్తలు