ఆనంద్ మహీంద్ర ట్వీట్ : మద్యం డెలివరీ

16 Jun, 2020 12:40 IST|Sakshi

 కాంటాక్ట్ లెస్ డెలివరీ : భలే ఐడియా

ఆనంద్ మహీంద్ర వైరల్ ట్వీట్

సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర మరో ఆసక్తిరమైన ట్వీట్ ను షేర్ చేశారు. కరోనా వైరస్,  లాక్‌డౌన్‌ నిబంధనల నేపథ్యంలో మద్యం షాపు యజమాని భౌతిక దూరాన్ని పాటిస్తున్న వీడియోను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. బీహార్‌లో ఓ మద్యం షాపు యజమాని అమలు చేస్తున్న ఈ వినూత్నఆలోచనకు ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. ఇపుడు ఈ వీడియో నెట్‌లో చక్కర్లు కొడుతోంది.  (కరోనా : బ్యాంకు ఉద్యోగి చిట్కా వైరల్)

మద్యం షాపులో మద్యం అమ్మేందుకు యజమాని ఒక టెక్నిక్ ను ఎంచుకున్నారు.  దాదాపు 5 అడుగుల దూరం వుండేలా జాగ్రత్తపడుతూ ఒక గొట్టం, తాడు  ద్వారా  భౌతిక దూరాన్ని పాటిస్తున్న వైనం ఆకర్షణీయంగా నిలిచింది. అంతేకాదు దుకాణం చుట్టూ కర్టెన్ కూడా ఏర్పాటు చేసుకోవడం విశేషం.

మద్యం కొనుగోలు చేయాలనుకున్న వ్యక్తి,  షాపు యజమాని ఏర్పాటు చేసిన గొట్టంలో ఉండే ఒక బాటిల్ లో డబ్బులు  ఉంచాలి. అపుడు యజమాని తాడు సాయంతో గొట్టం ద్వారా బాటిల్ ను వెనక్కు లాగి అందులోని డబ్బు తీసుకుంటారు. అనంతరం వారికి కావాల్సిన దానిని అదే  గొట్టంలోంచి కిందికి వదులుతారు. అలా వారి లావాదేవీ పూర్తవుతుందన్నమాట. కరోనా విస్తరణ భయంతో వ్యాపారులు, బ్యాంకు ఉద్యోగులు తదితరులకు నగదు లావాదేవీల నిర్వహణ కత్తిమీద సాములాంటిదే. గతంలో  ఒక బ్యాంకు ఉద్యోగి కి సంబంధించిన వీడియోను కూడా ఆనంద్ మహీంద్ర తన  ఫాలోయర్ల  కోసం షేర్ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు