కూల్ ప్యాడ్ మ్యాక్స్ లాంచింగ్ నేడే

20 May, 2016 11:20 IST|Sakshi

చైనీస్ హ్యాండ్ సెంట్ తయారీదారి కూల్ ప్యాడ్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను నేడు భారత మార్కెట్లోకి తీసుకురానుంది. కూల్ ప్యాడ్ మ్యాక్స్ అనే స్మార్ట్ ఫోన్ ను నేడు ఆవిష్కరించనున్నారు. ఈ ఫోన్ ధర రూ.10,000 నుంచి రూ.15,000 మధ్యలో ఉంటుందని అంచనా. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లి బిన్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్. జాంగ్సెంగ్ లువో, భారత సీఈవో సయ్యద్ తాజుద్దీన్ లు కలిసి ఈ ఫోన్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. 

"డ్యూయల్ ఇన్ వన్" అనే ట్యాగ్ లైన్ తో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. డ్యూయల్ సిమ్ సపోర్టుతో, ఆ రెండు సిమ్ లపై కూడా రెండు అకౌంట్లు కలిగి ఉండేలా యూజర్లకు ఈ ఫోన్ అందుబాటులో ఉంచనున్నారు. దీంతో వాట్సాప్, మెసేంజర్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రాంలు అన్నీ రెండు అకౌంట్లను యూజర్లు వాడుకోవచ్చు.   


మ్యాక్స్ ను మొదట చైనాలో రెండు వేరియంట్లగా విడుదలచేశారు. 32జీబీ స్టోరేజ్ మోడల్ ను 3జీబీ ర్యామ్, స్నాప్ డ్రాగన్ 615 ప్రాసెసర్ తో, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ను 4జీబీ ర్యామ్, స్నాప్ డ్రాగన్ 617 ప్రాసెసర్ తో ప్రవేశపెట్టారు. నేడు భారత్ లో ఆవిష్కరించబోతున్న ఈ ఫోన్ దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉండనుంది. ఈ కంపెనీ నుంచి రూ.8,999 కు కూల్ ప్యాడ్ నోట్ 3 ప్లస్ అనే స్మార్ట్ ఫోన్ అక్టోబర్ లో భారత మార్కెట్లోకి వచ్చింది.

కూల్ ప్యాడ్ మ్యాక్స్ ప్రత్యేకతలు....
5.5 అంగుళాల ఎఫ్ హెచ్ డీ కర్వ్డ్ 2.5డీ డిస్ ప్లే
12 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
5 మెగాపిక్సెల్ ముందు కెమెరా
2,800ఎంఏహెచ్ బ్యాటరీ
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్
డ్యూయల్ సిమ్స్ విత్ డ్యూయల్ అకౌంట్స్

మరిన్ని వార్తలు