ఆరు రోజుల ఎత్తు నుంచి కిందకు..!

20 Mar, 2019 00:51 IST|Sakshi

43 పైసల నష్టంతో  రూ.68.96కు రూపాయి

లాభాల స్వీకరణ కారణం!  

ముంబై: ఆరు ట్రేడింగ్‌ సెషన్ల వరుస రూపాయి ర్యాలీకి మంగళవారం బ్రేక్‌ పడింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 43పైసలు నష్టపోయి 68.96 వద్ద ముగిసింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు వచ్చిన డిమాండ్‌ తాజా రూపాయి బలహీనతకు కారణాల్లో ఒకటని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు వరుసగా ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో దాదాపు 161 పైసలు లాభపడ్డంతో, కొందరు ట్రేడర్లు లాభా ల స్వీకరణకు దిగారని కూడా విశ్లేషణలు ఉన్నాయి.

కాగా సోమవారం కీలక నిరోధాన్ని (68.50) అధిగమించిన రూపాయి, దీనిని మరుసటిరోజే నిలబెట్టుకోలేకపోవడం వల్ల తాజా ర్యాలీ మరింత కొనసాగడంపై అనుమానాలూ ఉన్నాయి.  ఈ సందర్భంగా క్రూడ్‌ ధరలు భారీగా పెరుగుతున్న విషయాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. 68.53 వద్ద ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్‌ ఒక దశలో 69.05ను కూడా చూసింది.  అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు