మౌలికరంగం నెమ్మది!

1 Nov, 2018 01:07 IST|Sakshi

సెప్టెంబర్‌లో 4.3 శాతం వృద్ధి  

నాలుగు నెలల కనిష్టం 

న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక రంగం వృద్ధి సెప్టెంబర్‌లో మందగించింది. వృద్ధి రేటు 4.3 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటు 4.7 శాతం. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి.మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో 40.27 శాతం వాటా ఉన్న ఎనిమిది విభాగాలనూ వేర్వేరుగా చూస్తే... 
ఎరువులు: 2.5 శాతంగా వృద్ధి నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటులో అసలు వృద్ధిలేకపోగా –7.7 శాతం క్షీణతలో ఉంది.  
సిమెంట్‌: వృద్ధి 0.1 శాతం నుంచి 11.8 శాతానికి ఎగసింది. 
విద్యుత్‌: ఈ విభాగంలో కూడా వృద్ధి 3.2 శాతం నుంచి 8.2 శాతానికి చేరింది.  
బొగ్గు: వృద్ధి 10.4 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గింది. 
రిఫైనరీ ప్రొడక్టులు: 8.1 శాతం నుంచి 2.5 శాతానికి డౌన్‌ 
స్టీల్‌: 3.7 శాతం నుంచి 3.2 శాతానికి మైనస్‌ 
క్రూడ్‌ ఆయిల్‌: 0.1 శాతం వృద్ధి –4.2 శాతం క్షీణతలోకి జారింది. 
సహజ వాయువు: 6.3 శాతం వృద్ధి నుంచి –1.8 శాతం క్షీణతలోకి పడింది.   

>
మరిన్ని వార్తలు