మౌలిక రంగం వృద్ధి డౌన్‌!

1 Jul, 2017 01:39 IST|Sakshi
మౌలిక రంగం వృద్ధి డౌన్‌!

2017 మేలో 3.6 శాతం
క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధిరేటు 5.2 శాతం  


న్యూఢిల్లీ: ఎనిమిది కీలక రంగాల గ్రూప్‌ ఉత్పత్తి వృద్ధి రేటు 2017 మే నెలలో 3.6 శాతంగా (2016 ఇదే నెల ఉత్పత్తి విలువతో పోల్చిచూస్తే) నమోదయ్యింది. 2016 మే నెల్లో ఈ గ్రూప్‌ వృద్ధి రేటు 5.6 శాతం. బొగ్గు, ఎరువుల రంగాల పేలవ పనితీరు తాజా సమీక్షా నెలపై ప్రతికూల ప్రభావం చూపింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో దాదాపు 37 శాతం వాటా ఉన్న ఈ ఎనిమిది కీలక రంగాల పనితీరునూ వార్షికంగా పరిశీలిస్తే....

బొగ్గు: 6 శాతం వృద్ధి రేటు –3.3 క్షీణతలోకి జారిపోయింది.
ఎరువులు: 6.2 శాతం వృద్ధి రేటు –6.5 శాతానికి క్షీణించింది.
క్రూడ్‌ ఆయిల్‌: –3.3 క్షీణత నుంచి స్వల్పంగా 0.7 శాతం వృద్ధికి మారింది.
సహజవాయువు: ఈ రంగం కూడా –6.5 శాతం క్షీణత నుంచి 4.5 శాతం వృద్ధికి మారింది
రిఫైనరీ ప్రొడక్టులు: వృద్ధి రేటు 3.3 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది.
స్టీల్‌: 13.4 శాతం వృద్ధి 3.7 శాతానికి జారింది.
సిమెంట్‌: వృద్ధి 2.7 శాతం నుంచి 1.8 శాతానికి పడిపోయింది.
విద్యుత్‌: వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 6.4 శాతానికి చేరింది.
కాగా నెలవారీగా చూస్తే మాత్రం వృద్ధి రేటు బాగుంది. ఏప్రిల్‌లో వృద్ధిరేటు 2.8 శాతంగా ఉంది. 

మరిన్ని వార్తలు