కరోనా : ఎయిరిండియా పైలట్లకు షాక్

2 Apr, 2020 16:30 IST|Sakshi
ఫైల్ ఫోటో

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా సంక్షోభకాలంలో  ప్రభుత్వరంగ విమానయాన  సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది.  అప్పుల ఊబిలో  కూరుకుపోయిన ఎయిరిండియా కరోనా వైరస్ కోరల్లో  చిక్కుకుని మరిన్ని ఇబ్బందుల్లో పడింది.  ఈ నేపథ్యంలో  సుమారు 200 పైలట్ల కాంట్రాక్టులను  తాత్కాలికంగా రద్దు చేసింది.  పదవీ విరమణ తర్వాత తిరిగి ఉద్యోగం పొందిన 200 మంది పైలట్ల  కాంట్రాక్టులను  తాత్కాలికంగా నిలిపివేశామని ఎయిరిండియా  సీనియర్ అధికారి గురువారం తెలిపారు. గత కొన్ని వారాలలో దాదాపు అన్ని విమానాలు నిలిచిపోవడంతో ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని ఎయిరిండియా ప్రకటించింది. రానున్న మూడు నెలల కాలానికి  క్యాబిన్ సిబ్బంది మినహా అన్ని  ఇతర ఉద్యోగుల జీత భత్యాల్లో 10 శాతం కోతను ఇప్పటికే తగ్గించింది. తాజాగా పైలట్ల నెత్తిన మరో పిడుగు  వేసింది.

కోవిడ్ -19 మహమ్మారిని అరికట్టడానికి ఏప్రిల్ 14 వరకు  దేశవ్యాప్త లాక్ డౌన్  పరిస్థితి కొనసాగనుంది. ఈ క్రమలో ఎయిరిండియా దేశంలో అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలను నిలిపివేసింది. అటు  రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిరిండియాలో వాటాల విక్రయానికి కేంద్రం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు