పెట్రోల్‌ అమ్మకాలు డౌన్‌

7 Apr, 2020 09:43 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో ఇంధనాలకు డిమాండ్‌ గణనీయంగా పడిపోయింది. వాహనాలు రోడ్ల మీదికి రావడం తగ్గిపోవడంతో మార్చిలో పెట్రోల్‌ అమ్మకాలు 17.6 శాతం, డీజిల్‌ విక్రయాలు 26 శాతం క్షీణించాయి. పలు విమానాలు రద్దు కావడంతో విమాన ఇంధన (ఏటీఎఫ్‌) అమ్మకాలు ఏకంగా 31.6 శాతం పడిపోయాయి. పెట్రోల్‌ అమ్మకాలు పడిపోవడం దాదాపు రెండున్నరేళ్లలో ఇదే తొలిసారి.  ఏటీఎఫ్‌ విక్రయాలు 31.6 శాతం క్షీణించగా.. ఎల్‌పీజీ అమ్మకాలు మాత్రం 1.9 శాతం పెరగడం విశేషం.

సేవల రంగం కుదేలు
మార్చిలో క్షీణతలోకి జారిన సూచీ
న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో భారత్‌లో సేవల రంగం మార్చిలో తీవ్రంగా నష్టపోయింది. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ 49.3గా నమోదైంది. ఈ సూచీ 50 పాయింట్ల పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువనకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. దీని ప్రకారం, మార్చిలో క్షీణతలోకి జారినట్లే. ఫిబ్రవరిలో ఈ సూచీ 85 నెలల గరిష్ట స్థాయి 57.5 వద్ద ఉంది. (కేంద్రం నుంచి మరో ఆర్థిక ప్యాకేజీ!)

మరిన్ని వార్తలు