ఎంజీ మోటారు అమ్మకాలకు కరోనా షాక్

1 May, 2020 14:47 IST|Sakshi

సాక్షి,ముంబై : కరోనా ప్రభావంతో  ఆటో అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. ఇప్పటికే దేశీయ కార్ల దిగ్గజం మారుతి జీరో అమ్మకాలను నమోదు చేయగా తాజాగా ఈ జాబితాలో ఎంజీ మోటార్ ఇండియా చేరింది. దేశ వ్యాప్త  లాక్‌డౌన్  కారణంగా విక్రయాలు సున్నా శాతానికి పడిపోయాయని సంస్థ శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. కరోనా వైరస్ మహమ్మారి కట్టడి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా షోరూమ్‌లు మూసి వేయడంతో 2020 ఏప్రిల్  రిటైల్ అమ్మకాలు పడిపోయాయని ఎంజి మోటార్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఏప్రిల్ 2020 చివరి వారంలో హలోల్‌లోని తన సౌకర్యం వద్ద చిన్నస్థాయిలో కార్యకలాపాలు, తయారీని ప్రారంభించామని,  దీంతో మే నెలలో ఉత్పత్తి  తిరిగి పుంజుకుంటుందనే ఆశా భావాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు  స్థానిక సరఫరా  చెయిన్ మద్దతు కోసం కృషి చేస్తున్నట్టు తెలిపింది. (కరోనా : అయ్యయ్యో మారుతి!)

కాగా మార్చి 22న జనతా కర్ఫ్యూ అమలు, ఆ తరువాతి రోజునుంచి 21 రోజుల లాక్‌డౌన్ అమలైంది. అయినా వైరస్ కు అడ్డుకట్టపడకపోవడంతో పొడిగింపుతో మే 3 వరకు దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా వైరస్ బారిన పడకుండా వుండేందుకు ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని దేశప్రధాని పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  దేశీయంగా, అంతర్జాతీయంగా రవాణా,ఇతర వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. అత్యవసర సేవలు, వస్తువుల విక్రయం మినహా అన్ని ఆర్థిక కార్యకలాపాలు నిలిచి పోయాయి.  (లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఇన్ఫీ మూర్తి స్పందన) (భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర)

>
మరిన్ని వార్తలు