వాహన అమ్మకాలు రివర్స్‌గేర్‌లోనే..

2 Jun, 2020 05:36 IST|Sakshi

మారుతీ విక్రయాల్లో 89% డౌన్‌

హ్యుందాయ్, మహీంద్ర సేల్స్‌ 79% క్షీణత

న్యూఢిల్లీ: దేశీ వాహన రంగం రివర్స్‌గేర్‌లోనే పయనిస్తోంది.  కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఈ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.  మారుతీ సుజుకీ విక్రయాల్లో ఏకంగా 89% తగ్గుదల నమోదైంది. గతేడాది మే నెల్లో 1,25,552 యూనిట్లను విక్రయించిన ఈ సంస్థ గతనెల్లో 13,888 యూనిట్లను మాత్రమే అమ్మగలిగింది. ఇదే విధంగా మిగిలిన కార్ల తయారీ కంపెనీలు కూడా విక్రయాల్లో భారీ తగ్గుదలను ప్రకటించాయి. మరోవైపు ద్విచక్ర వాహన రంగ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ మే నెల అమ్మకాలు 83% శాతం తగ్గిపోగా.. వాణిజ్య వాహన రంగానికి చెందిన అశోక్‌ లేలాండ్‌ సైతం 90% క్షీణతను నమోదుచేసింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం కోసం ఏప్రిల్‌లో సంపూర్ణ లాక్‌డౌన్‌ కొనసాగిన కారణంగా ఆ నెల్లో దాదాపు అన్ని సంస్థలు సున్నా సేల్స్‌ను ప్రకటించడం తెలిసిందే.

మరిన్ని వార్తలు