రూ. 5 లక్షల లోపు తక్షణ రిఫండ్‌

10 Apr, 2020 10:37 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ నుంచి చెల్లింపుదారులకు రావాల్సిన మొత్తాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయనుంది. రూ. 5 లక్షల లోపు రిఫండ్‌లను తక్షణమే చెల్లించనున్నట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. దీని వల్ల 14 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజం కలుగుతుందని వెల్లడించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో వ్యాపార సంస్థలు, చెల్లింపుదారులకు వెంటనే ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఐటీ విభాగం తెలిపింది. పెండింగ్‌లో ఉన​ జీఎస్‌టీ, కస్టమ్స్‌ రిఫండ్‌లు రూ.18,000 కోట్లను కూడా విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దీని ద్వారా ఎంఎస్‌ఎంఈలు సహ లక్ష సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్‌ ఫైలింగ్‌ గడువును జూన్‌ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. 

‘కరోనా’ ఉపకరణాలపై పన్నుల ఎత్తివేత
వెంటిలేటర్లు, ఫేస్‌ మాస్క్‌లు, సర్జికల్‌ మాస్క్‌లు, పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్స్‌(పీపీఈ), కోవిడ్‌-19 కిట్స్‌ మొదలైన వాటి దిగుమతులపై కస్టమ్స్‌ డ్యూటీ, హెల్త్‌ సెస్‌లను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉపకరణాల తయారీలో వినియోగించే వస్తువుల దిగుమతి కూడా కస్టమ్స్‌ డ్యూటీ, హెల్త్‌ సెస్‌ సెప్టెంబర్‌  వరకు ఉందడబోవని తెలిపింది. కాగా, న్యూస్‌ప్రింట్‌పై విధిస్తున్న 5 శాతం కస్టమ్స్‌ సుంకాన్ని తొలగించాలని, న్యూస్‌పేపర్‌ సంస్థలకు రెండేళ్ల పాటు ట్యాక్స్‌ హాలిడే ఇవ్వాలని ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) కోరింది. అలాగే, బీవోసీ ప్రకటన రేటును 50 శాతం, ప్రింట్‌ మీడియాకు బడ్జెట్‌ను 100 శాతం పెంచాలని విజ్ఞప్తి చేసింది.

చదవండి: మాంద్యం గుప్పిట్లోకి ప్రపంచం!

మరిన్ని వార్తలు