లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: రంగంలోకి కొత్త ఇన్వెస్టర్లు

17 Jul, 2020 14:19 IST|Sakshi

ఈ క్యూ1లో 25లక్షల కొత్త డీమాట్‌ ఖాతాల సృష్టి

టైర్‌-2, టైర్‌-3 నగరాల నుంచే 80శాతం కొత్త ఇన్వెస్టర్లు

కరోనా ప్రేరిపిత లాక్‌డౌన్‌తో భారత స్టాక్‌మార్కెట్లోకి  కొత్త ఇన్వెస్టర్లు రాక పెరిగింది. కొత్తవారి ఆగమనంతో ఎక్చ్సేంజీల ట్రేడింగ్‌ యాక్టివిటీ భారీస్థాయిలో జరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో 25లక్షల కొత్త డీమాట్‌ ఖాతాలు తెరవబడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.  

జూన్‌లో జరిగిన మార్కెట్‌ యాక‌్షన్‌ను పరిశీలిస్తే ఈ ట్రెండ్‌ను నిర్ధారించుకోవచ్చు. నిఫ్టీ ఇండెక్స్‌ ఈ జూన్‌లో 7శాతం పెరిగింది. నెల ప్రాతిపదికన మార్కెట్‌ టర్నోవర్‌ 37శాతం వృద్ధి చెంది రూ.14.6లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే జూన్‌లో ఇన్‌స్టిట్యూషనల్‌ విభాగంలో టర్నోవర్‌ 9శాతం వృద్ధిని సాధించి రూ.5లక్షల కోట్లుగా నమోదైనట్లు ఎన్‌ఎస్‌ఈ గణాంకాలు చెబుతున్నాయి.  
  
ఇందుకే రిటైల్‌ ఇన్వెస్టర్లు పెరిగారు: 
కరోనా కట్టడికి లాక్‌డౌన్‌తో విధింపుతో చాలామంది ఇళ్లలో చిక్కుకుపోయారు. అందులో భారీగా డబ్బున్న వారు స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. భారత్‌లో బెట్టింగ్‌ చట్టబద్ధం కాకపోవడంతో ఖాళీ సమయాన్ని గడిపేందుకు ఎలాంటి ఇతర ప్రత్యమ్నాయాలు లేకపోవడంతో వారు ట్రేడింగ్‌ పట్ల ఆకర్షితులయ్యారు. దాదాపు అన్ని బ్రోకరేజ్‌ సంస్థలు ఉచిత డీమాట్‌ ఖాతా ప్రారంభాన్ని అందిస్తున్నాయి. దీనికి తోడు కొత్తవారికి ప్రోత్సాహకాలు, డిస్కౌంట్‌లు ఇస్తుండటం కూడా స్టాక్‌ మార్కెట్లో రిటైల్‌ ఇన్వెస్టర్లు పెరిగారు. 

ఏయే బ్రోకరేజ్‌లో ఎంతమంది: 
ఈ జూన్‌ క్వార్టర్‌లో టాప్‌-12 బ్రోకరేజ్‌ సంస్థలు దాదాపు 13లక్షల కొత్త డీమాట్‌ అకౌంట్లను ప్రారంభించినట్లు నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజీటరీ లిమిటెడ్‌ తెలిపింది. అందులో అత్యధికంగా జిరోదా బ్రోకింగ్‌ 5,26,917 కొత్త ఖాతాలను ప్రారంభించింది. ఏంజిల్‌ బ్రోకింగ్‌ 1,90,397 అకౌంట్లు, 5పైసా క్యాపిటల్‌ 1.31లక్షల ఖాతాలు నమోదయాయ్యాయి. 

ఈ నగరాల నుంచే అధికంగా రాక: 
కొత్తగా స్టాక్‌ మార్కెట్లో ప్రవేశించినవారిలో 80శాతం మధ్య, చిన్నతరహా నగరాలైన నాసిక్‌, జైపూర్‌, పాట్నా, కన్నూర్‌, గుంటూర్‌, తిరువళ్లూర్‌, నైనిటాల్‌తో పాటు ఇతర టైర్‌-2, టైర్‌-3 నగరాలను నుంచి వస్తున్నట్లు  బ్రోకరేజ్‌ సంస్థలు తెలిపారు. స్టాక్‌ మార్కెట్‌లోకి కొత్త ఇన్వెస్టర్లు రాక కొత్తేంకాదని అయితే కరోనా ప్రేరిపిత లాక్‌డౌన్‌ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్లు, కొత్త ఇన్వెస్టర్లు కిందటి ఏడాదితో పోలిస్తే మరింత పెరిగారని బ్రోకరేజ్‌ సంస్థలు తెలిపాయి. 

‘‘ ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్ల నగదు విభాగంలో రిటైల్‌ ఇన్వెస్టర్ల కాంట్రిబ్యూషన్‌ పెరుగుతోంది. భారత్‌లో కూడా అదే విధంగా జరుగుతుంది. గత రెండేళ్లలో నగదు విభాగంలో పాల్గోనే రిటైల్‌ ఇన్వెసర్ల సంఖ్య క్రమంగా 50-52శాతానికి చేరుకుంది.’’ బీఎన్‌పీ పారిబా సీఈవో జైదీప్‌ అరోరా తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా